Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ఔరా.. ఔషధ ప్రయోగాలు

నాలుగేళ్లలో 400 శాతం పెరిగిన అనుమతులు, నియంత్రణ లేక బలవుతున్న సామాన్యులు

Medicine

ముంబై : ఐదేళ్లపాటు స్తబ్దత కొనసాగిన తరువాత భారతదేశంలో ఔషధ ప్రయోగాలు తిరిగి పుంజుకుంటున్నా యి. మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువగా, 2013లో కేవలం 17 ఔషధ పరిశోధనలకు మాత్రమే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డిసిజిఐ) నుంచి అనుమతులు లభించాయి. అయితే ఈ సంఖ్య నెమ్మదిగా 2017 నాటికి 97కు చేరింది. అంటే గత ఐదేళ్లలో ఇది 400 శాతం పెరిగిందన్నమాట.నియత్రణ అధికారులు, దేశీయ నిపుణులు గుణాత్మకమైన అభివృద్ధికి శాస్త్రీయ పద్ధతులు, సమతుల్యమైన సూచనలు అందివ్వడం వల్ల పరిశోధనలు వేగంగా ముందుకు సాగాయి. అయితే భారతదేశంలో అడ్డగోలు ఔషధ ప్రయోగాలు నియంత్రించే వ్యవస్థ లేకపోవడం వల్ల ఔషధ పరిశోధనల్లో సామాన్యులు బలి పశువులవుతున్నారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు.

కాని, ఔషధ ప్రయోగాల్లో సంఖ్యా పరంగా సాధించిన అభివృద్ధి 2013 కు ముందు ఎన్నడూ లేకపోవడం విశేషం.ఉదాహరణగా తీసుకుంటే 2012లో డిసిజిఐ 253 పరిశోధలనకు అనుమతిచ్చింది. 2011లో 283, 2010లో 529 పరిశోధనలకు అనుమతిచ్చింది. ఈ పరిశోధనలు నిర్వహించడానికి ప్రైవేటు సంస్థలకు సమాన అవకాశాలు కల్పిస్తున్న తీరుని మనం చూస్తున్నామని డిసిజిఐ బోర్డు సభ్యురాలు సునీల థాటె చెప్పారు. 2012లో ఔషధ పరిశోధనల్లో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని స్వస్థా అధికార్ మంచ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో ఓ పిల్ దాఖలు చేసింది. ఈ ఔషధ పరిశోధనల కొరకు ఎంచుకున్న వ్యాధిగ్రస్తులకు పరిశోధనలు జరిపే సంస్థలు అసలు విషయం తెలియజేయడం లేదని, వారికి నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. అదే సమయంలో 59వ పార్లమెంటరీ కమిటీ రిపోర్టు వెల్లడించిన అంశాల ప్రకారం మందుల తయారీదారులు, ఆ మందులను రాసే డాక్టర్లు, కొంతమంది ప్రభుత్వ నియంత్రణ అధికారుల మధ్య గట్టి బంధం వుందని తేలింది.

ఈ ముగ్గురు కుమ్మక్కు కావడం వల్ల సామాన్యులు బలి పశువులు అవుతున్నారని తెలిపింది. 2013లో ఔషధ ప్రయోగాల బాధితుల్లో నష్ట పరిహారానికి అర్హులను గుర్తించాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఔషధ ప్రయోగాలు చేసే కంపెనీల యజమానులు తమ ప్రయోగాలు కొనసాగించడానికి కొత్త ప్రాంతాల వేట మొదలుపెట్టారు. బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలన్న క్లాజ్ దుర్వినియోగం చేసుకునే అవకాశాలకు తావిచ్చింది. బాధితులను ప్రలోభ పెట్టడానికి అది ఉపయోగపడింది. అంతేకాకుండా ఔషధ పరిశోధనల్లో పాల్గొనే వ్య్యాధిగ్రస్తులతో ఉచితంగా అందించే చికిత్స విధానం అని నమ్మబలకడానికి ఆస్కారమిచ్చింది. నిజానికి ఔషధ ప్రయోగాలు, అధ్యయనంలో భాగంగా చేయడానికి, దానికి భిన్నంగా చేయడానికి మధ్య స్పష్టమైన తేడాని ప్రభుత్వ ఉత్తర్వు చూపించలేకపోయిందని డిసిజిఐ బోర్డు సభ్యురాలు సునీల థాటె చెప్పా రు. అంతేకాకుండా ఔషధ పరిశోధనలకు అనుమతులు ఇవ్వడానికి చాలా కాలం పట్టడం వల్ల ప్రయోగాల కంపెనీలు అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉంటాయని ఆమె తెలిపారు.

ఔషధ ప్రయోగాలు చేపట్టే కంపెనీలు ఒక డ్రగ్ మీద చేసే పరిశోధనలు మూడుసార్లకు మించరాదని ప్రభుత్వ ఉత్తర్వులోని క్లాస్ చెప్తుందని డిసిజిఐ అధికారి డాక్టర్ ఎల్. ఈశ్వర్‌రెడ్డి చెప్పారు. ఈ ఔషధ ప్రయోగాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహించాలి. ఔషధ ప్రయోగాలు చేపట్టే అసుపత్రిలో కనీసం 50 పడకలు ఉండాలి. అయితే ఔషధ ప్రయోగాలను క్రమంగా అంతర్జాతీయ ప్రమాణాల స్థాయికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక సాధారణంగా 50 శాతం ఔషధ ప్రయోగాలు ప్రైవేట్ అసుపత్త్రులోనే ్ల జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అక్కడ ఒక ఔషధంతో కేవలం మూడుసార్లు మాత్రమే ప్రయోగం చేయాలన్న పరిమితి పరిశోధకులకు లేదని ఆయన తెలిపారు. అయితే బాధితుడి పరిస్థితిని బట్టి ఎంత నష్ట పరిహారం చెల్లించాలనేదాన్ని లెక్క కడుతున్నామని డాక్టర్ ఈశ్వర్ రెడ్డి తెలిపారు.

క్లినికల్ టెస్ట్‌లో వివాదాలు

ఇక తాజాగా జైపూర్‌లో జరిపిన ఔషధ ప్రయోగం వివాదంలో చిక్కుకుంది. ఔషధ ప్రయోగానికి ఎంచుకున్న పేషంట్‌ని మోసం చేశారని సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉన్న లోపాలను ఎత్తి చూపించిందని స్వస్థా అధికార్ మంచ్ సంస్థ కో-కన్వీనర్ అమూల్య నిధి తెలిపారు. ఇండియన్స్ ఇప్పటికీ గిని పిగ్స్‌లా కొనసాగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు 2012లో నిర్వహించిన ఔషధ ప్రయోగాల్లో 436 ప్రతికూల విషమ సంఘటనలు చోటు చేసుకున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక 201౦లో 590, 2014లో 443 ఔషధ ప్రయోగాల్లో పేషంట్లలో సీరియస్ ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని తెలిపింది. వీటిలో 2012లో 16, 2013లో 46, 2014లో 22 మంది పేషంట్లలో ఔషధ ప్రయాగాలు వికటించి విషమ పరిస్థితి ఏర్పడిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

2015లో పేషంట్లలో సీరియస్ ప్రతికూల పరిస్థితులు ఏర్పడి 162 మంది చనిపోయారని, అవి ప్రైవేట్ మందుల కంపెనీల ఔషధ ప్రయోగాల వల్లనే చనిపోయారన్నది నిర్ధారణ కాలేదని ప్రకటించింది. ప్రభుత్వ లెక్కలను గమనించినట్లయితే బాధితులందరికీ నష్ట పరిహారం అందినట్టు అవి సూచిస్తాయి. అయితే నష్ట పరిహారం అందుకున్న వారి పేర్లు, వారి అడ్రసులు తెలపమని అడిగితే ప్రభుత్వ అధికారుల నుంచి సమాధానం రాదని స్వస్థా అధికార్ మంచ్ సంస్థ కో-కన్వీనర్ అమూల్య చెప్పారు. నిజానికి ఔషధ ప్రయోగాలను తరచుగా పర్యవేక్షించడానికి డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు లేరని, ఇక ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ఔషధ ప్రయోగాల వివరాలు తెలుసుకుందామంటే అవి సమాచార హక్కు చట్టం కిందకు రావని ఆయన చెప్పారు. నిజానికి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందన్నది ఎవరికీ తెలియదని,దీనివల్ల ఔషధ పరిశోధనల్లో చట్టాల ఉల్లంఘనలు యదేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.

క్లినికల్ టెస్ట్ అంటే...

క్లినికల్ టెస్ట్ జరుపకుండా ఇండియాలో
ఏ మందుని మార్కెట్లో విడుదల చేయడానికి వీల్లేదు.
ప్రపంచ జనాభాలో ఇండియా జనాభా
17 శాతం, ప్రపంచ వ్యాధి భారం 20 శాతం
ఇండియాలో జరిపే ఔషధ ప్రయోగాలు
1.4 శాతం కన్నా తక్కువ
మార్కెట్లో విడుదల చేయడానికి ముందు జరిపే సమగ్రమైన పరీక్ష క్లినికల్ టెస్ట్
అనేక సంవత్సరాలు ప్రయోగశాలల్లో, జంతువులపై ప్రయోగాలు జరిపిన తరువాత అది మనిషికి ఎలాంటి హాని కలిగించదని తేలిన తరువాతనే మనిషిపై ప్రయోగం జరపాలి. అదే క్లినికల్ టెస్ట్.
మనిషికి ఉపయోగపడే కొత్త మందుని తయారు చేయడానికి పట్టే కాలం 12-15 సంవత్సరాలు
10,000 మందుల్లో క్లినికల్ టెస్ట్‌కి పనికొస్తాయని తేలినవి 10 మాత్రమే

Comments

comments