Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

తల్లి చేతిలో బలయిన 3 నెలల చిన్నారి…

Baby-died

మహబూబాబాద్: మానసిక స్థితి సరిగా లేని ఓ తల్లి చేతిలో ముక్కుపచ్చలారని మూడు నెలల చిన్నారి బలైపోయింది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లే చిన్నారి పాలిట మృత్యువైంది. ప్రపంచాన్నిచూసిన మూడు నెలలకే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి. ఈ ఘటన బయ్యారం శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని నర్సిహులపేట మండలం మంగిమడుగు బంజరకు చెందిన సురేశ్, సరిత దంపతులకు ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, 3 నెలల బాబు ఉన్నాడు. కొన్ని రోజులుగా ఆమె మానసిక పరిస్థితి సరిగా లేనందున కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. దీంతో మండలంలోని కట్టుగూడెం గ్రామంలో ఉన్న దేవుడమ్మ వద్దకు అత్త లచ్చమ్మ, తల్లి పద్మతో సహా కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చి పూజలు చేయించారు. వారు ఆటోలో తిరుగు ప్రయాణంలో, బయ్యారం శివారులోని పాకల ఏటి దగ్గరకు రాగానే సరిత ఆటోను ఆపమని డ్రైవర్‌ను కోరింది. ఈ సందర్భంలోనే తన చేతిలో ఉన్న మూడు నెలల బాబును బ్రిడ్జి నుంచి కింద పడేసి తాను కూడా దూకబోయింది. అది గమనించిన ఆటో డ్రైవర్ వెంటనే సరితను అడ్డుకున్నాడు. ఆటో ఆపి కిందకు వెళ్లి చూడగా అప్పటికే బాబు చనిపోయాడు. చిన్నారి మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు, స్థానికులు శోక సంద్రంలో మునిపోయారు.

Comments

comments