Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మార్స్‌పై మీథేన్..!

Mars

అంగారకుడిపై గతంలో నీరు ఉండేదని పరిశోధకులు నిర్ధారించిన సంగతి తెలిసిందే. అంగారక గ్రహం అధ్యయనం నిమిత్తం అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా పంపించిన క్యూరియాసిటీ రోవర్ మార్స్‌లోని గుట్టును మెల్లగా చేధిస్తోంది. మార్స్‌పై  జీవం మనుగడకు సంబంధించిన అధ్యయనంలో మరో ముందడుగు వేసింది. అంగారక గ్రహానికి చెందిన శిలలపై సేంద్రియ అణువులు, మీథేన్ ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ   అణువుల్లో కార్బన్, హైడ్రోజన్‌తోపాటు ఆక్సిజన్, నైట్రోజన్ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గ్రహంపై మూలాధార జీవులు మీథేన్‌ను ఆహార వనరుగా ఉపయోగించుకుని ఉంటాయని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. మీథేన్  వాయువు జీవి ఉనికికి ఆధారం. జీవరసాయనిక చర్య కారణంగానే ఇక్కడ మీథేన్ వెలువడుతుంది. ఈ గ్రహంపై జీవం ఉందని దీని ద్వారా చెప్పలేనప్పటికీ, ఆ దిశగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయని నాసా శాస్త్రవేత్త మైఖేల్ మేయర్ అభిప్రాయపడుతున్నారు.

Comments

comments