Search
Tuesday 19 June 2018
  • :
  • :

తన్నీరు హరీశ్‌రావు@46

Minister harish Rao 46th Birth Day Celebrations

ఘనంగా మంత్రి హరీశ్ రావు జన్మదిన వేడుకలు
పుష్పగుచ్ఛంతో ప్రత్యేక శుభా కాంక్షలు తెలిపి న కలెక్టర్ వెంకటరాంరెడ్డి
జిల్లా వ్యాప్తంగా ఎంవిఆర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు 46వ జన్మదిన వేడుకలు సిద్దిపేటలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.వెం కటరాంరెడ్డి మంత్రికి పుష్పగుచ్చం అందించి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సిద్దిపేటలోని ప్రజాప్రతినిధుల, ఉ ద్యోగుల, అభిమానుల, కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న ప్రత్యేక కార్యక్రమాలలో మంత్రి పాల్గొని కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రా జనర్సు ఆధ్వర్యంలో మున్సిపల్ సమావేశ మందిరంలో మంత్రి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మం త్రి స్ఫూర్తితో నాయకులు మొక్కలు నాటారు. మసీదుల్లో ప్రత్యే క నమాజ్‌లు, ఆలయాల్లో పూజలు చేశారు. ఎంవిఆర్ హెల్పిం గ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని సూడా డైరెక్టర్, కౌన్సిలర్ మచ్చ వేణుగోపా ల్‌రెడ్డి ప్రారంభించారు. ఆయా కార్యాక్రమాల్లో బర్ల మల్లిఖార్జున్, ప్రవీణ్ కుమా ర్, ఆనంద్, బాబుజాని జాలిద్, వజిర్, ప్రభాకర్, మహేష్, బాబు, రవి, గ్యాదరి పరమేశ్వర్, విక్రంరెడ్డి పాల్గోన్నారు.

Comments

comments