Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

అన్ని రంగాల్లో మైనార్టీల అభివృద్ధి

Minorities development in all fields

మైనార్టీల ప్రేమాభిమానంతో రాష్ట్ర  ముఖ్యమంత్రి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధ్ది చేసేందుకు ఎక్కువ నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పా రు. మంగళవారం ప్రగతిభవన్‌లో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీతో కలిసి  జిల్లాలో మైనార్టీ సంక్షేమం ద్వారా అమలు జరుగుతున్న పథకాలను ఎంపి కల్వకుంట్ల కవిత సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపి కవిత మాట్లాడుతూ జిల్లాలో వక్ఫ్ భూములు  ఎన్ని ఉన్నాయో ఒక డేటా తయా రు చేసేందుకు సంబంధిత అధికారులను ఆదే శాలు జారీ చేయాలన్నారు. ఆ భూములు కమ్యూనిటీ  ఉపయోగించుకునే విధంగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి తగు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. నిరు ద్యోగ యువత ఉపాధి కల్పన వివిధ వృద్ధుల్లో మైనార్టీ వర్గాల కు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఆర్థిక సహయం అందించే ప్రక్రియ లో బ్యాంకర్లు పెండింగ్ పెట్టవద్దన్నారు. రుణాల వల్ల దారిద్య్రరేఖ దిగు వనున్న కుటుంబాలు పైకి వచ్చే అవకాశం ఉందన్నారు. బాధల్లో ఉన్న వారికి ఈ పథకం ద్వారా ప్రయోజకం కలిగే విధంగా బ్యాంకర్లు తమవంతు బాధ్యతగా ముందుకు రావాలన్నారు. ఈద్గ, షాదీఖానాల నిర్మా ణా లకు నిధులను మం జూరు చేయాలన్నారు.

మైనార్టీ మెటర్నటీ ఆసు పత్రి జిల్లా కేంద్రంలో స్థలం సేకరణ పూర్తయి నందున నిధుల మంజూరు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆర్థిక శాఖలో పెండింగ్‌లో ఉన్నందున ప్రత్యేక చొరవతో నిధులను మంజూరు చేయాలని కోరారు. ఉర్దూ జూనియర్ కళాశాల భవనం నిర్మాణం పూర్తయి జూనియర్ కళాశాల మంజూరు చేయా లన్నారు. కొన్ని రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్నందున వాటిని భర్తీ చేసేందుకు కృషి చేయాలని ఏర్పాటు చేసిన భవనంలో సరైన అవసరమైన సదుపాయాలు లేని పక్షంలో డైట్ కళాశాలలో తాత్కాలిక ఏర్పాటు చేసి ప్రవేశాలు జరపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. నాగారంలో 20 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉన్నందున రెసిడెన్షియల్ పాఠశాల స్వంత భవనాల నిర్మాణం చేయాలని కోరారు. జిల్లాలకు 18 కోట్లతో 3 భవనాలు నిర్మాణం కోసం మంజూరైనందున వెంటనే నిర్మాణాలను చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. మోపాల్, గుండారం, తిర్మన్‌పల్లి, సిరికొండ, జక్రాన్‌పల్లిలో షాదీ భవనాలను మంజూరు చేయాలని కోరారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్త మాట్లాడుతూ పట్టణంలో 3 షాదీ ఖానాలు మంజూరైన వెంటనే స్థలం సేకరించి ఆ నిర్మాణాలను సత్వరమే చేపడుతామని చెప్పారు. బాన్సువాడ, కామారెడ్డి నియోజకవర్గంలో ఒక్కొక్క షాదీ ఖానాకు రూ.30 లక్షలు కేటాయిస్తే నిజామాబాద్ జిల్లాలో 10లక్షల చొప్పున కేటాయించారని కనీసం 25లక్షల నుండి 30లక్షల వరకు నిధులను కేటాయించాలని సూచించారు. బదిలీల నేపథ్యంలో షాది ముబారక్ దరఖాస్తులు పెండింగ్ ఉండకుండా ఇదివరకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంఎల్‌సి విజి గౌడ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments