Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మైనార్టీల సంక్షేమానికి రూ. 1400 కోట్లు

Minorities welfare of Rs. 1400 crores

మనతెలంగాణ/యాలాల : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మనసున్న మహారాజని అన్ని వర్గాల సంక్షేమాన్ని కాంక్షించి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టడం జరిగిందని, అందులో భాగంగానే మైనార్టీల సంక్షేమానికి గాను రూ.  1400 కోట్లు కేటాయించడం జరిగిందని అన్నారు. యాలాల మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో దావత్-ఇ–ఇఫ్తార్ మరియు దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడుతూ తాండూరు ప్రాంతంలో రూ. 36 కోట్లతో మైనార్టీల కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పెళ్ళీడు కొచ్చిన పేదింటి ఆడపడుచులకు పెద్దన్నగా మారి వారి పెళ్ళికోసం శాదీముబారక్, కళ్యాణలక్ష్మి వంటి పథకాలకు రూపకల్పన చేసి అండగా నిలువడం జరుగుతుంన్నదని అన్నారు.  మండల ఎంపిపి సాయన్నగౌడ్. పిఎసీఎస్ చైర్మన్ సిద్రాల శ్రీనివాస్, తాండూరు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనంతయ్య
ముదిరాజ్, స్థానిక ఎంపిటీసి రూపవతి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కరుణం పురుషోత్తమ రావు, కోకట్ ఎంపిటీసి శంకర్, మల్లారెడ్డి, తహశీల్దార్ అశోక్‌కుమార్, వివిద గ్రామాల మైనార్టిలు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో రైతుల కోసం మొబైల్ ఎటిఎంలు
రాష్ట్రంలో రైతుల సంక్షెమం కోసం సిఎం కేసిఆర్ మరో కొత్త పథకం ద్వారా మేలు చేస్తున్నారని హెచ్‌డిసిసి బ్యాంకుల ద్వారా మొబైల్ ఎటిఎంలను ప్రారంభించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి వెల్లడించారు.సోమవారం తాండూరు పట్ఠణంలోని హెచ్‌డిసిసి బ్యాంకులో మొబైల్ ఎటిఎంను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో రైతులు ఎదుర్కోంటున్న బ్యాంకుల సమస్యలను పరిష్కరించడానికి రైతుల కోసం ప్రభుత్వం మొబైల్ ఎటిఎంలను ప్రారంభించినట్లు తెలిపారు. డిసిసిబి చైర్మన్ పెంటారెడ్డి,టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు,తాండూరు మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాంలింగారెడ్డి,జడ్పిటిసి రవిగౌడ్,తహాశిల్దార్ రాములు ఉన్నారు.

దేశ భక్తుల విగ్రహాల ఆవిష్కరణ సంతోషంగా ఉంది
ప్రజలకు సులభ మైన పరిపాలన అందించాలన్న ఉద్దేశ్యంతో సిఎం కేసిఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు చేశారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు.సోమవారం మండల పరిధిలోని చెంగోల్,మిట్టబాస్పల్లి,గోనూర్ గ్రామాలలో వివిధ అభివృద్ది పనులకు, గ్రామ పంచాయతీ కార్యాలయాల భవనాలు,దేశ భక్తుల విగ్రహాలను మంత్రి ప్రారంబించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతు రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం సిఎం కేసిఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని అన్నారు.అదే విధంగా దేశ భక్తుల విగ్రహాలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందని అన్నారు. ఎంపిపి కోస్గి లక్ష్మమ్మ,జడ్పిటిసి రవిగౌడ్,పెద్దేముల్ ఎంపిపి వాణిశ్రీ,తాండూరు వైస్ ఎంపిపి శేఖర్,మండల రైతు సమితి కన్వినర్ రాంలింగారెడ్డి,టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తం రావు,జిల్లా నాయకులు వడ్డేశ్రీనివాస్,తాండూరు మున్సిపల్ చైర్మన్ కోట్రిక విజయలక్ష్మి,కౌన్సిలర్‌లు పరిమళ,నీరజాబాల్‌రెడ్డి,గ్రామ సర్పంచ్‌లు గౌడి మంజూల వెంకటయ్య,ఇస్మాయిల్,ఎంపిటిసి కవిత,రుక్కిబాయి,తహాశిల్దార్ రాములు,పిఆర్ ఈఈ మనోహర్,,డిఇ శ్రీనివాసులు,ఎంఇఓ వెంకటయ్య గౌడ్,వివిధ శాఖల అధికారులు యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

comments