Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

మిషన్ భగీరథను వేగవంతం చేయాలి

Mission Bhagiradha  works must speed up the tremor

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి : జిల్లాలో మిషన్ భగీరథ కార్యక్రమం కింద ఇంటింటికి త్రాగునీరు అందించాలన్న ఉద్దేశ్యంతో చేపట్టిన పనులలో వేగం పెంచి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఆర్‌డబ్లూస్, మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆర్‌డబ్లూస్ ఎస్‌ఈలు, ఈఈలు, డిఈలతో మిషన్ భగీరథ పనులను సెగ్మెంట్‌ల వారీగా పనులను కలెక్టర్ సమీక్షించారు. గ్రామాలలో అంతర్గత పైప్‌లైన్ పనులను సమీక్షించారు. నిర్ధేశించిన సమయానికి పనులు పూర్తి చేసేందుకు కృషి చేయాలని, ఇసుక సమస్య రాకుండా చూడాలని, అవసరం వున్న చోటు ఇసుక కొరకు ఎస్‌పిని కలిసి సంబంధిత ఏజెన్సీకి ఇసుక అందేవిధంగా చూడాలని తెలిపారు. జిల్లాలీఓ మిషన్ భగీరథ క్రింద ఉదయ సముద్రం సెగ్మెంట్ పరిధఙలో నిర్మిస్తున్న వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా నిర్వహించారు. కాల్వపల్లి గుట్ట పైప్ కనెక్షన్ పనులు పూర్తి చేయాలని, పంపింగ్ పైప్ పెండింగ్ పనులను రెండు రోజుల్లో పూర్తి చేసి, ఈ 25 వరకు పనులు పూర్తి చేయాలని, గాంధీ నగర్ పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేయాలని  మెల్కలకాలువ రెగ్యూలేటర్ గేట్ పనులు ఈనెల చివరి వరకు పూర్తి చేసి ఇరిగేషన్ శాఖ వారికి అప్పగించాలని కలెక్టర్ అన్నారు. ఇంట్రా విలేజ్ కింద జిల్లాలో 15 వందల ట్యాంకులకు గాను 273 పూర్తి చేయడం జరిగిందని, మేస్త్రీల కొరత కారణంగా పనులు నెమ్మదిగా నడుస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, సంబంధిత కాంట్రాక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ ఎస్‌ఈ మధుబాబు, ఆర్‌డబ్లూస్ ఈఈ పాపారావు, గ్రిడ్ సూర్యాపేట ఎం.వెంకటేశ్వర్లు, డిఈలు ఎండి ముజీబుద్దిన్, మధు, నర్సింహ్మ, బ్రహ్మంబాబు, మురళీ, ఎండి అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments