Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

కామెడీ, హర్రర్ ఎంటర్‌టైనర్

cini

హోమానంద్, పావని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టర్ హోమానంద్’. జై రామ్‌కుమార్ దర్శకత్వంలో ఓం తీర్థం ఫిల్మ్‌మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ముందుగా ట్రైలర్, బిగ్ సీడీని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆడియో సీడీలను నిర్మాత మల్కాపురం శివకుమార్ విడుదల చేసి తొలి సీడీని మంత్రి మహీందర్ రెడ్డికి అందజేశారు. అనంతరం మంత్రి మహీందర్ రెడ్డి మాట్లాడుతూ “రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను. కొత్త వాళ్లు అయినప్పటికీ అందరూ బాగా నటించారు. ట్రైలర్ చాలా బాగుంది. పాటలు, సినిమా పెద్ద విజయం సాధించి టీమ్ అందరికీ మంచిపేరు రావాలి”అని అన్నారు. హీరో హోమానంద్ మాట్లాడుతూ “హీరోగా నాకిది తొలి సినిమా. ఎలా నటించాలో తెలియక మొదట్లో కొంచెం టెన్షన్ పడ్డాను. కానీ నా నటన చూసి సీనియర్ యాక్టర్‌లా చేసేవని అందరూ అంటుంటే చాలా సంతోషంగా ఉంది”అని తెలిపారు. దర్శకుడు జైరామ్ కుమార్ మాట్లాడుతూ “కామెడీ, హర్రర్ జోనర్ సినిమా ఇది. ఇలాంటి పాయింట్స్‌తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. కానీ మా సినిమా వాటికి భిన్నంగా కొత్తగా ఉంటుంది. హీరో కొత్తవాడైనప్పటికీ చాలా బాగా నటించాడు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు బోలేషావళి, రాజా వన్నెం రెడ్డి, పావని, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments