Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పేదింటి ఆడపిల్లలకు కళ్యాణలక్ష్మి వరం

MLA Gadari Kishore Distribution of Kalyanalakshmi checks

మనతెలంగాణ/నాగారం(అర్వపలి)్ల:  ప్రభుత్వం అందిస్తున్న పేదింటి ఆడ పిల్ల పెళ్లి కోసం ఇస్తున్న కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ఒక వరమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు.సోమవారం నాగా రం మండల కేంద్రంలోని అర్‌ఎస్‌బి బంగ్లాలో కళ్యాణలక్ష్మీ చెక్క్‌లను పంపిణీ చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో మాట్లాడు తూ ఎన్నికల్లో హమీలను నెరవేర్చి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి తెలంగాణ ప్రజలకు అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. మండలంలో 48 మందికి కళ్యాణలక్ష్మీ,షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఇప్పటి వరకు నాగారం మండలంలో 162 మందికి చెక్కులను 1కోటి 40లక్షల రూ చెక్కులను అందించా మన్నారు. తుంగతుర్తి నియోజక వర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తుంగతుర్తి నియోజక వర్గం ఏంతో అభివృద్ధి చెందిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఎంపీపీ కొమ్మినేని సతీష్ ,జడ్‌పిటిసి పెరాల పూలమ్మ, ఎంపిటిసి వంగురి రజిత, తహశీల్ధార్ చంద్ర శేఖర్, పిఎసిసి చైర్మన్ గుంతకండ్ల అశోక్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మండల అధ్య క్షులు గుండగాని అంబయ్య, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు కల్లెట్లపల్లి శోభన్ బాబు, టిఆర్‌ఎస్ నాయకులు కల్లెట్లపల్లి ఉప్పలయ్య, రైతు సమ న్వయ జిల్లా కమిటి సభ్యులు పోదిల్ల రమేష్ గౌడ్ పాల్గొన్నారు.

Comments

comments