Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

వెయ్యి కోట్లతో తుంగతుర్తి అభివృద్ధి

MLA Gadari Kishore Speech About Devlopment TTy Mondal

మనతెలంగాణ/తుంగతుర్తి: తుంగతుర్తి నియోజక వర్గంలో సుమారు వెయ్యి  కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ,నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలోకి తుంగతుర్తి శాసన సభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ తేవడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల కాలంగా తుంగతుర్తి ప్రాంత వాసులు ఎదురు చూస్తున్న రావులపల్లి-కర్కాల బ్రిడ్జి నిర్మాణం ఆరున్నర కోట్లతో చేపట్టి దాదాపు పనులు పూర్తి చేయడంతో ,పక్క  జిల్లాలకు రవాణా సౌకర్యం మెరుగైందని ప్రజలు అంటున్నారు. అలాగే తుంగతుర్తి ప్రాంతానికి శాశ్వత సాగునీటి వనరులు లేక ,వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతాంగ కష్టాలను గట్టెక్కించడానికి తుంగతుర్తి మండలంలోని రుద్రమ చెరువును రిజర్వాయర్‌గా మార్చడానికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం రుద్రమ చెరువు పరిశీలనకు భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీష్ రావు ఇటీవలనే రావడంతో రైతాంగం  శాశ్వత సాగునీటి వనరులు ఏర్పడతాయని, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో  వీధులు కనీ సం నడవడానికి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటు న్న తీరుకు స్వయంగా పల్లె నిద్ర ద్వారా తెలుసుకున్న శాసన సభ్యులు లక్షలాది రూపాయలు మం జూరు చేసి గ్రామాలలో సిసి రోడ్లు వేయడంతో ఆయా గ్రా మాల ,ఆవాసాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగు పరచడంతో ,నియోజకవర్గంలో రవాణా రంగం కొంత మేర మెరుగుపడింది. నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో పల్లె నిద్రలు చేసిన ఎమ్మెల్యే ఆయా గ్రామాల మౌలిక వసతులను గ్రామ సభల ద్వారా తెలుసుకుని ,పరిష్కార యోగ్యమైన సమస్యలను అక్కిడికక్కడే పరిష్కరిస్తూ , జటిలమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారం అయ్యేలా కృషి చేయడంతో గ్రామాల్లో మౌలి క వసతుల సమస్య కొంత మేర పరిష్కారం అయ్యిందని ఆయా గ్రామాల వారు అభిప్రాయ పడుతున్నా రు. తుంగతుర్తి నియోజక వర్గానికి సాగు నీరందించే శ్రీరాం సాగర్ కాలువలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే  మరమ్మతులకు సుమారు రూ. 210 కోట్లు మంజూరుకు ప్రభుత్వానికి నివేదిక పంప డం ,త్వరలో కాలువల మరమ్మత్తులు ,తూ ముల నిర్మాణం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాలువల మరమ్మతు జరిగి, తూములు ఏర్పడితే శ్రీరాం సాగర్ కాలువల ద్వారా వచ్చే నీరు నేరుగా చెరువులలోకి వెళ్తుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనా తుంగతుర్తి నియోజక వర్గాన్ని శాసన సభ్యు లు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న కాలంలో నియోజక వర్గాన్ని మరిం త అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్ళాలని యావత్ ప్రజానీకం ఆశిస్తున్నారు.

Comments

comments