Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

అన్నల ఇలాకాలో అభివృద్ధి

 MLA has been sanctioned by the Primary Health Center

మనతెలంగాణ/ కమ్మర్‌పల్లి/ నిజామాబాద్‌రూరల్ : నక్సల్‌బరి ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు మానాల గ్రామస్తుల భాగస్వామ్యం చరిత్రలో లిఖింపదగినది. ఈనేపథ్యంలో పదహారు గిరిజన తండాలను మెడలో వేసుకున్న హారంలా దర్శనమిచ్చే ఈ గ్రామానికి గతమెరగని అభివృద్ధ్దిని పరిచయం చేసింది. అధికార తెరాస ప్రభుత్వం అన్నల ఇలాఖాగా గుర్తింపు పొందిన ఈ గ్రామాన్ని అభివృద్ధ్దికి చిరునామాగా గుర్తింపు తీసుకురావడంలో బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ పీసరి తుకారాం కృషిని ఆ గ్రామస్తులు, గిరిజనులు వల్లేవేసిన వైనం అందరిని ఆశ్చర్యానికి లోనుచేసింది. ఒకే గ్రామం అభివృద్ధ్దికై 24 కోట్ల రూ.లు మంజూరు చేయడం అందరిని ఆలోచింపచేసింది. ఈ నిధుల వరదతో ఆనందానికి గురైనా ఆ గ్రామస్తులు తెరాస పార్టీతోనే ఉంటామని తేల్చి చెప్పడంతో ప్రారంభోత్సవాలు చేసిన భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఫిదా అయ్యారు.
* జనహారతుల మధ్య ప్రారంభోత్సవాలు ః
మానాల గ్రామానికి సోమవారం విచ్చేసిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం ఫలికారు. భాజాభజంత్రిలు, మంగళహారతులతో జనహారతులు పట్టారు. తొలుత గ్రామంలో నూతనంగా నిర్మించిన యూత్ బిల్డింగ్‌ను ప్రారంభించారు. వైద్య సదుపాయాలు, రవాణా సౌకర్యం లేక అల్లాడుతున్న గ్రామస్తులను కాపాడుకునేందుకు సర్పంచ్ కోరిక మేరకు ఎమ్మెల్యే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేయించారు. ఈ నూతన భవన నిర్మాణానికై 1.20 కోట్ల రూ.లు వెచ్చించనున్నారు. ఈ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గిరిజన తండాలతో అల్లుకుపోయిన ఈ గ్రామంలో నూతనంగా రూ. 4.20 కోట్లతో గిరిజన బాలికల గురుకుల పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. రూ. 12లక్షలతో శ్మశానవాటిక అభివృద్ధ్ది పనులను ప్రారంభించారు. రూ. 13.50 కోట్లతో మిషన్ భగీరథ ఒక్క నీటి సరఫరా 2.76 కోట్ల రూ.లతో అంతర్గత పైప్‌లైన్లు, ఇంటింటా నల్ల కనెక్షన్లు వెచ్చించారు. ఈ పనులు పూర్తవడంతో ట్రయల్న్ ప్రారంభించారు. 5లక్షల సిడిపి నిధులతో మహిళా భవనాన్ని ప్రారంభించారు. గైది గుట్ట తండాలోని ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని ప్రారంభించారు. అడ్డబోరు తాండలో 73లక్షలు, జోత్యానాయక్ తాండలో 37లక్షలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పటికే గ్రామంలో 2 కోట్ల రూ.తో వాడవాడకు సిసి రోడ్లను నిర్మించగా ఆ రోడ్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అందరిని మంత్రముగ్దులను చేసింది. 7500 జనాభా గల ఈ గ్రామంలో అభివృద్ధ్దికి వరదల్లా నిధులు మంజూరు చేయడంపై జనం మురిసిపోయారు. రానున్న ఎన్నికల్లో తెరాస పార్టీ వెంటే ఉంటామని వెల్లడించారు.
* ప్రేమాభిమానాలే ప్రధానం ః
మానాల గ్రామంలోని మహిళా అమరవీరుల స్థూపం వద్ద బహిరంగ సభ నిర్వహించగా, ఈ సభకు తరలివచ్చినా జనాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసంగించారు. మానాలవాసుల ప్రేమాభిమానాలే తనకు ప్రధానమని వెల్లడించారు. ఉద్యమ ప్రస్థానంలో ఈ గ్రామస్తుల చొరవ మరవలేనిదని, ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడమే తన కర్తవ్యమన్నారు. ప్రజల వద్దకే నేను వస్తానని, తానేప్పుడూ హైదరాబాద్‌కు రప్పించుకోలేదని వివరించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సమాజం ఎన్నో త్యాగాలు చేసిందని, ప్రజల అవసరాలు తీర్చాల్సిన గురుతల బాధ్యత నాయకులపై ఉంటుందని ముఖ్యమంత్రి కెసిఆర్ చెబుతుంటారని చెప్పారు. ఇక అభివృద్ధ్ది చేయాల్సింది ఎంపీ కవిత, తానేనని సిఎం గుర్తుచేసినట్లుగా చెప్పారు. గ్రామాల్లో అనేక సమస్యలున్నాయని, ప్రధాన సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధ్ది చేస్తున్నామని చెప్పారు. మండల కేంద్రానికి సుదూరంగా ఉన్న మానాల గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని 2 సంవత్సరాలుగా పోరాడానని చెప్పారు. మండలానికి ఒకే ఆసుపత్రి ఉండాలనే నిబంధన సమస్యగా మారినప్పటికీ స్పెషల్ కేటగిరి కింద పిహెచ్‌సి మంజూరు చేయాలని సిఎంను ఒప్పించానని వివరించారు. ఆసుపత్రి మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాగునీటి ఎద్దడి తీర్చేందుకై 82 కిలో మీటర్ల దూరంలో ఉన్న పోచంపాడ్ నుండి మిషన్ భగీరథ ద్వారా పైప్‌లైన్ వేసి కారేపల్లి, దేవక్కపేట్‌లో పంపింగ్ కేంద్రాలను నిర్మించామని వివరించారు. ఈ పనులు పూర్తవడంతో మానాలవాసులకు ఇంటింటా గంగనీరు సరఫరా చేసేందుకు ట్రయల్న్ చేసామని తెలిపారు. 8 గిరిజన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేయడమే గాక గిరిజన బాలికల గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. ప్రజా సమస్యలను దూరం చేయడమే తమ ప్రభుత్వలక్షమని, ప్రజల ఆశీస్సులు తమపై ఉండాలన్నారు.
40యేళ్ల కల సాకారం : సర్పంచ్ తుకారాం
40యేళ్ల నుండి గిరిజన గురుకుల పాఠశాల మంజూరు అయిందనే మాటలు వింటూ వచ్చామని, ఆ కల ప్రస్తుతం ఎమ్మెల్యే చొరవతో సాకారమైందని సర్పంచ్ తుకారాం అన్నారు. గ్రామాభివృద్ధ్దికి నిధుల వరద కురిపించిన ఎమ్మెల్యేకు పాదాభివందనం చేస్తూ, రానున్న ఎన్నికల్లో స్వచ్చంధంగా తెరాసకు మద్దతు నిలుస్తామని వెల్లడించారు. దీంతో సభ ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యురాలు లక్ష్మిభాస్కర్‌యాదవ్, ఎంపిపి కౌసల్య, వైస్ ఎంపిపి బాదవేణి రాజారాం, విడిసి చైర్మన్ బాదవేణి రాజన్న, అధికారులు, సర్పంచ్‌లు, తెరాస నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

comments