Search
Tuesday 19 June 2018
  • :
  • :

2019లోనూ టిఆర్‌ఎస్‌దే అధికారం

MLA Vemula Prathap Reddy Speech About 2019 Elections

మన తెలంగాణ/ముప్కాల్: 2019లో అధికారం మళ్లీ టిఆర్‌ఎస్ పార్టీదే అని మిషన్ భగీరథ వైస్ చైర్మన్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువారం ముప్కాల్ మండల కేంద్రంలో టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించి  పార్టీ పతిష్టాతకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీ కోసం సైనికుల్లా పని చేసి బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరు భాగాస్వామ్యలు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముస్కు భుమేశ్వర్, ఎంపిపి అర్గుల రాధ చిన్న య్య, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, మునిరోద్దిన్, కట్ట మహేష్ తదితరులు పాల్గొన్నారు.
దేశం చూపు తెలంగాణ వైపు
దేశం చూపు మొత్తం తెలంగాణ వైపు వుందని భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. గురువా రం మండలంలోని కొత్తపల్లి గ్రామంలో 35 లక్షలతో అంతర్గత సిసి రోడ్ పనులకు 20 లక్షలతో రాజ రాజేశ్వర మందరమునకు సిసి రోడ్డు పనులకు, నాగంపేట్ గ్రామంలో 28 లక్షలతో వెంకటేశ్వర స్వామి మందిరమునకు సిసి రోడ్డు పనులకు 10 లక్షలతో గ్రామ అంతర్గత సిసి రోడ్డు పనులకు శంకు స్థాపన చేసి, ముప్కాల్ చర్చి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ సీఎం కెసిఆర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు అభివృద్ది చేస్తున్నాడని అన్నారు. గ్రామంలో ఉన్న కాలనిలో రోడ్డు లేక కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులు పడే వారని వారిని దృష్టిలో పెట్టుకోని గ్రామాలను అభివృద్ది చేస్తున్నాడనివ అన్నారు. గ్రామాలలో ఇంటి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లను త్వరలోనే అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు ముస్కు భూమేశ్వర్, జైడి రాజవ్వ రాజేశ్వర్, నాగంపేట్ ముత్తెవ్య, ముత్తెన్న, ఎంపిపి అర్గుల రాధ చిన్నయ్య, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సామ వెంకట్ రెడ్డి, వేల్పూర్ మార్కెట్ కమిటి చైర్మన్ పుట్ట లలిత, కట్ట మహేష్, మునిరోద్దిన్, గంగాధర్, గోపాల్, రాజేశ్వర్, ఉమ శంకర్ తదితరులు పాల్గోన్నారు.

Comments

comments