Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కేంద్రంలో మోడీ పాలనకు నాలుగు ఏళ్లు

Modi Government Completed Four Years In Central

మన తెలంగాణ/భూపాలపల్లి : కేంద్రంలో మోడీ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు అవినీతి రహిత పాలనను అందించి విజయవంతంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షు లు, మాజీ ఎమ్మెల్యే మార్తీనేని ధర్మారావు అన్నారు. గురువారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడిచిన నాలుగు సంవత్సరాల్లో పేద, బడుగు, బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బిసి అణగారిన వర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశ పెట్టిందన్నారు. ప్రతి పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలనే లక్షంతో ప్రధాన మంత్రి జనధన్ యోజన పథకం ద్వారా 22 కోట్ల బ్యాంక్ ఖాతాలను చేయించి మధ్య దళారుల నుంచి వారిని రక్షించేవిదంగా గ్యాస్ సబ్సిడీ, ముద్రలోన్స్‌లాంటి వాటికి ఉపయోగించే విధంగా పేదవాడికి బ్యాంక్ లో ఖాతా ఇప్పించిన ఘనత బిజెపి ప్రభుత్వానికే దక్కిందన్నారు. గతంలో ప్రభుత్వం రాకముందు దేశంలో 9 కోట్ల మందికే గ్యాస్ ఉండేది అట్టడుగు ప్రజలకు పేదలకు ఉచితంగా 47లక్షల 52 వేల కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. రైతుల కోసం ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకం ప్రవేశపెట్టి రైతులకు ఇన్సూరెన్స్ కల్పించడం జరిగిందన్నారు. చిన్నపిల్లలకు అభివృద్ధి కోసం బేటిబచావో బేటిపఢావో పథకం ప్రవేశ పెట్టడం, స్వచ్భ భారత్ పేరుతో 65 లోక్షల 52 వేల మరుగు దొడ్లు నిర్మించామని 9లక్షల 11వేల స్కూల్లో 30 శాతం మరుగు దొడ్లు మాత్రమే ఉండేదని వాటిని 80 శాతం స్కూల్లలో మరుగు దొడ్లు నిర్మంచామని అన్నారు. దీంతో మహిళల ఆత్మ గౌరవంతో ఆడ పడచులు బ్రతుకుతున్నారని తెలిపారు.
ముద్రలోన్స్ ద్వారా 3 సంవత్సరాలోల్లో 9 లక్షల కోట్ల రుణాలను పేద మహిళలకు అందించారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం 10 కోట్ల కేటాయించి 50 కోట్ల ప్రజలకు కుటుంబాలకు ఐదు లక్షల ఆరోగ్య బీమా పథకం తెచ్చారని తెలిపారు. పేదవాడి అభివృద్ధికి ఉపయోగ పడేవిధంగా నిబద్దతకు కట్టుబడి ఉండి పేద ప్రజల అభివృద్ధే లక్షంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని దర్మారావు అన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెన్నంపల్లి పాపన్న భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి, నాయకులు నాగపూరి రాజమౌళి గౌడ్,చదువు రాంచంద్రరెడ్డి, కన్నం యుగేందర్, ఏడునూతల నిషీధర్‌రెడ్డి, అర్బన్ అధ్యక్షులు దొంగల రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments