Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

నేను ఫిట్.. మీరో…?

తన ఉదయకాల వ్యాయామ దృశ్యాల విడియోను పోస్ట్ చేసి కర్నాటక సిఎంకు సవాల్ విసిరిన ప్రధాని మోడీ
నా ఫిట్‌నెస్ కంటే నా రాష్ట్ర అభివృద్ధి వికాసాలే నాకు ముఖ్యం : కుమారస్వామి

PM-MOdi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన ఫిట్‌నెస్ విడియోను బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఉదయం పూట వ్యా యామం చేస్తూ.. ప్రకృతిలో ఉండే పంచతత్వాల( పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం) నుంచి తాను ప్రేరణ పొందానని మోడీ సోషల్ మీడియాలో తెలిపారు. ఇలా చేయడంవల్ల తాజాగా, ఉత్సాహంగా ఉంటుందని, శ్వాస ప్రాక్టీసు ఎక్సర్‌సైజులు కూడా చేస్తుంటానని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. నల్లని జాగింగ్ డ్రెస్‌లో ఓ చెట్టు చుట్టూ నిర్మించిన ట్రాక్‌పై నడవడం, పెద్ద బండరాయిపై ఒరిగి స్ట్రెచ్ ఎక్సర్‌సైజులు చేయడం, ధ్యానం చేయడం వంటివి విడియోలో పోస్ట్ చేశారు. మనం ఫిట్‌గా ఉంటేనే భారత్ ఫిట్‌గా ఉంటుందన్నారు. క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని మోడీ ఒకటిన్నర నిమిషాల విడియోను పోస్ట్ చేశారు. ఇదే సమయంలో ఆయన ఫిట్‌నెస్ ఛాలెంజ్‌ను కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి విసిరారు. అంతేకాక 2018లో కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనికా బాత్రాతో పాటు 40 ఏళ్లకు పైబడిని ఐపిఎస్ అధికారులు కూడా ‘హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్‌కు ఆహ్వానించారు.

Karnataka-CMదీటుగా స్పందించిన కుమారస్వామి
ప్రధాని నరేంద్ర మోడీ ఫిట్‌నెస్ సవాలుకు కర్నాటక ముఖ్యమంత్రి ప్రతిస్పందించారు. దానికి కుమారస్వామి తన అధికారిక ట్విట్టర్‌లో ‘డియర్ నరేంద్రమోడీజీ, నా ఆరోగ్యంపట్ల మీరు శ్రద్ధ కనబరిచినందుకు కృత్ఞతలు, శారీరక దృఢత్వం అందరికీ అవసరమని నేను నమ్ముతున్నాను. అందుకే ప్రతి ఒక్కరూ వ్యాయమం, యోగా, జిమ్ వంటి ఏదో ఒకవిధమైన ఫిట్‌నెస్ ఎకర్‌సైజుల చేయాలి.
నా రోజువారీ వర్కవుట్లలో ట్రెడ్‌మిల్, యోగా భాగం. అయితే నా శారీరక దృఢత్వం కన్నా నా రాష్ట్ర అభివృద్ధి, యోగ్యతలే నాకు ముఖ్యం. అందుకు మీ సాయాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కుమారస్వామి రెండు సార్లు గుండె ఆపరేషన్లు చేయించుకున్నారు. అందులో మొదటిది 2007లో కాగా, రెండోది గత ఏడాదిలో. తన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉన్నందునే సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నుంచే ఎవరైనా నడిపిస్తే బాగుంటుందని తన తండ్రి హెచ్.డి.దేవెగౌడ ఇటీవల చెప్పిన విషయాన్ని కూడా కర్నాటక సిఎం కుమారస్వామి ప్రస్తావించారు.

Comments

comments