Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

షమీ మరో పెళ్లికి రెడీ అవుతున్నాడు: హసీన్

Mohammed Shami respond on Hasin Jahan's Allegations Of Second Marriage

కోల్‌కతా: భారత పేసర్ మహ్మద్ షమీ ఆయన భార్య హసీన్ జహాన్ వ్యవహారం ఇటీవల ఎంతటి వివాదాస్పదమైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షమీపై హసీన్ వివాహేతర సంబంధం, మ్యాచ్‌ఫిక్సింగ్, గృహ హింస ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదం కొనసాగుతుండగానే తాజాగా జహాన్ మరో బాంబు పేల్చింది. రంజాన్ మాసం తర్వాత షమీ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పింది. అంతేగాక పండుగ అయిపోయిన ఐదు రోజుల తర్వాత ఈ వివాహం జరగనుందని ఆమె చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన షమీ… ఒక పెళ్లి చేసుకునే నరకం అనుభవించానని, మరో పెళ్లి చేసుకోవడానికి తాను పిచ్చోడిని కాదన్నాడు. ఒక వేళ మరో పెళ్లి చేసుకుంటే మాత్రం హసీన్ ను తప్పకుండా ఆహ్వానిస్తానని చమత్కరించాడు. కుటుంబ గొడవల కారణంగా ప్రస్తుతం ఫామ్ లేమితో బాధపడుతున్న షమీ త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ పర్యటనలోనైనా సత్తాచాటి పూర్వపు ఫామ్ ను అందుకుంటానని ఆకాంక్షించాడు.

Comments

comments