Search
Tuesday 19 June 2018
  • :
  • :

కుటుంబ కలహాలతో తల్లి సహా ముగ్గురు పిల్లలు ఆత్మహత్య

Morried Woman Committed Sucide With her Daughters

గాందారి: ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తాను విషం తీసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన  మండలంలోని గుర్జాల్ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. గుర్జాల్ గ్రామానికి చెందిన సుజాత కుటుంబ కలహాలతో తన ముగ్గురు పిల్లలకి విషం ఇచ్చి తాను విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ  సంఘటనలో పెద్ద కూతురు నందిని చనిపోయింది. మిగిత ఇద్దరు కవల పిల్లలు ధనుష్, ధరణి కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గ్రామస్థులు తెలిపారు. నందిని శవాన్ని కామారెడ్డి ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. కూతురు సుజాతను భర్త చిత్రహింసలకు గురి చేయడంవల్లే నలుగురు ఆత్మహత్యలకు ప్రయత్నం చేశారని బంధువులు తెలిపారు. భార్య భర్తల గొడవలు గురుజాల ఆత్మహత్యలకు కారణమని సి.నాగరాజు తెలిపారు. సుజాత బంధువుల ఫిర్యదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments