Search
Tuesday 19 June 2018
  • :
  • :

రోడ్డు మూయబడినది..

7,113 కి.మీ తిరిగి రండి..

Road-Closed

పిట్టకొంచం..కూతఘనం అన్న మాట ఆస్ట్రేలియా కు అక్షరాలా వర్తిస్తుంది. చూడడానికి చాలా చిన్నదేశం. జనసాంద్రతా చాలా తక్కువ. జనావాసాలు బాగా ఉండే చోటే కిలోమీటర్‌కు ముగ్గురు ఉంటే మహాగొప్ప. స్థూలంగా ఇలా ఉన్నా దేశంలో ఒక నగరం నుంచి మరో  నగరానికి పోవాలంటే ఎంతోదూరం ప్రయాణించాల్సి ఉంటుంది.

ఉదా: పెర్త్ నుంచి కర్రాతకు వెళ్ళాలంటే 1,522 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. పెర్త్ దక్షిణదిక్కున ఉంటే కర్రాత ఉత్తర దిక్కున ఉంటుంది. కానీ రెండు నగరాలు దక్షిణ ఆస్ట్రేలియా కిందికే వస్తాయి. వాయవ్య దిక్కున ఉండే నగరాలను గ్రేట్‌నార్తరన్ హైవేకు కలిపే రోడ్డులో ఏదో రిపైర్ వచ్చింది.. ఫలితంగా ఈ మైన్‌రోడ్‌ను మూసేయాల్సి వచ్చింది. ఫలితంగా వాహనదారులు పెర్త్ నుంచి కర్రాతకు వెళ్ళాలన్నా అటు నుంచి ఇటు రావాలన్నా 1,522 కి.మీకి అదనంగా 7,113 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. నాన్ స్టాప్‌గా ప్రయాణించినా అదనంగా 76 గంటలు కావాలి. ఈ మాట వినగానే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.

Comments

comments