Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

కల్తీలేని పండు తాటిపండు

మనకు ప్రకృతి నుండి లభించిన వరం తాటిముంజలు. కేవలం వేసవిలో మాత్రమే దొరికే ఆహారం తాటిముంజలు. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. కొంచెం తియ్యగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండి లోపలి భాగంలో నీరు ఉంటుంది.

Toddy-tree1

తాటాకులతో పేదలు పాకలు వేసుకుంటారు. చిన్న వ్యాపారస్తులు బుట్టలు, సంచులు, విసనకర్రలు, గొడుగులు చేసి అమ్ముతారు. తాటి చెట్టు కలప దూలాలుగా, స్తంభాలుగా ఉపయోగపడతాయి. తాటిపళ్ల నుండి తాండ్ర తయారు చేసి వ్యాపారం చేస్తారు. వీటిలో ఉండే పోషకాలు విలువైనవి. కేవలం వేసవిలో దొరికే తాటిముంజలకి మంచి గిరాకీ వుంటుంది. మనకి పండు నుంచి నేరుగా ఒలిచి ఇచ్చే కల్తీ లేని తాటి ముంజలు అంటే ఇష్టపడనివారుండరు.

ఇవి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. పొటాషియం ఎక్కువ శాతం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం వీటిలో మెండుగా ఉంది. ఎముకలను బలంగా ఉంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. వేడి నుండి కాపాడి జీర్ణక్రియను మెరుగు పరుస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇవి ఇస్తే మంచిది. షుగర్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మంచిది. వీటిలో ఎ,బి,సి విటమిన్లు ఉంటాయి. శరీరంలో గ్లూకోజు స్థాయిని పెంచి, కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఐరన్, ఫాస్పరస్, పొటాషియం లాంటి పోషకాలు ఈ తాటి ముంజలనుండి మనకు లభిస్తుంది. ఎండల కారణంగా వచ్చే అలసట, నీరసం నుండి ఈ ముంజలు ఉపశమనాన్ని ఇస్తాయి.

బ్రెస్ట్ కేన్సర్, ట్యూమర్ లాంటి వాటిని రాకుండా ఇవి కాపాడతాయి. స్త్రీలకి గర్భధారణ సమయంలో ఏది తిన్నా అజీర్తి, వాంతులు లాంటి సమస్యలు ఎదురవుతాయి. అటువంటి వారికి ఈ ముంజలు తింటే ఉపశమనం పొందుతారు. చాలామంది ఇవి తినేటప్పుడు పొట్టుతీసి తింటారు. కానీ అసలు పోషకాలు ఆ పొట్టులోనే ఉంటాయి. అనారోగ్యంగా ఉన్నవారు ఆ పొట్టుతో సహా తింటేనే మంచిది. దీనిని కొన్ని చోట్ల ‘ఐస్ యాపిల్’ అంటారు.

Comments

comments