Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సింగపూర్ చేరుకున్న కిమ్

North Korea President Kim Jong Un Reached to Singapore

సింగపూర్ : సింగపూర్‌లో ఈనెల 12న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య భేటీ జరగనుంది. ఈ భేటీ కోసం ఆదివారం ఉదయం కిమ్ సింగపూర్ చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ప్యాంగ్యాంగ్ నుంచి ఎయిర్ చైనా 747 విమానంలో కిమ్ సింగపూర్ చేరుకున్నట్టు సింగపూర్ మీడియా వెల్లడించింది. ఛాంగీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కిమ్ జోంగ్ ఉన్‌కు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ స్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం కిమ్ సింగపూర్ అధ్యక్షుడు లీ హీన్ లూంగ్‌తో భేటీ అవుతారు. ఇదిలా ఉండగా జి7 సదస్సులో భాగంగా కెనడా పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సింగపూర్‌కు బయల్దేరారు. దీంతో సింగపూర్‌లో ట్రంప్, కిమ్ బస చేసే హోటళ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

North Korea President Kim Jong Un Reached to Singapore

Comments

comments