Search
Tuesday 19 June 2018
  • :
  • :

వృద్ధుడి దారుణ హత్య

OldMan brutally killed by Unknown People In sangareddy
పుల్‌కల్‌ః పుల్‌కల్ మండలం చౌటకూర్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి  ఓ వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యడు. జోగిపేట సీఐ తిరుపతి రాజు అందిందచి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. అందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన ఒగ్గు బాగయ్య (70)ను గుర్తు తెలియని దుండగులు చౌటకూర్ శివారులోని కొన్నాల గ్రామానికి వెళ్లే రహదారిలో డప్పు మొగులయ్య వ్యవసాయ క్షేత్రంలో దారుణంగా హత్య చేసి గోనె సంచిలో కప్పి ఉంచారు. ఎడమ వైపు తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికులకు సమాచారం తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలం వద్ద హతుడి సంబంధించిన సెల్‌ఫోన్, రూ.20 విలువ చేసే బాండ్ పేపర్ లభించాయి. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ రంగ ప్రవేశం చేశాయి. డాగ్ స్కాడ్ సంఘట స్థలం నుంచి చౌటకూర్ గ్రామ సమీపంలోని 161 సంగారెడ్డి-, అకోలా జాతీయ రహదారి వరకు చేరుకుని అక్కడ నిలిచిపోయాయి. హత్య చేసిన దుండగులు జాతీయ రాహదారి మీదుగా పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. క్లూస్‌టీం హత్యస్థలి నుండి హతుడి రక్త నమూనాలు సేకరించారు.మృతుడికి భార్యతో పాటు 5గురు కుమారులు ఉన్నారు.భార్య ఒగ్గు మల్లమ్మఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అన్ని కోనాలను దర్యాప్తు జరుపుతున్నట్లు సిఐ తిరుపతిరాజు చెప్పారు.

Comments

comments