Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

One Dead in Road Accident near Shamshabad Airport Today

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయం బ్రిడ్జి కింద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన తర్వాత లారీతో పాటు డ్రైవర్ అక్కడి నుంచి ఉడాయించాడు. రక్తపుమడుగులో పడి ఉన్న క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ రోడ్డు ప్రమాదం గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని ఎయిర్‌పోర్టు పోలీసులు చెప్పడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments