Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కారులో మంటలు…. ఒకరు సజీవదహనం

Fire-accident-in-Car

గజ్వేల్‌:  కారులో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ ఘటన  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రాంతం రిమ్మనగూడలో   శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది.  స్థానికుల కథనం ప్రకారం.. గత రాత్రి 11 గంటల ప్రాంతంలో సిద్దిపేట వైపు వెళ్తున్న ఎపి 11పి 8686 అనే నంబర్ గల కారులో మంటలు చెలరేగాయి. వాహనదారులు అప్రమత్తమై కారు అద్దాలు పగలగొట్టి లోపలున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే  మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో కారులో ఉన్న వ్యక్తి పూర్తిగా కాలిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు ఇంకా తెలియలేదు. కారులో గ్యాస్‌ సిలిండర్‌ లీకైందా.. లేక పెట్రోల్‌ లీకుతో ప్రమాదం జరిగిందా.. అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments