Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ముగిసిన ఒయు పిజి సెట్… రెండు వారాల్లో ఫలితాలు

Osmania-University

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో వివిధ పిజి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఒయుసెట్ 2018 పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రోజు మూడు విడతలుగా జూన్ 4తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఒయుసెట్ ద్వారా ఒయుతో పాటు మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ, తెలుగు విశ్వవిద్యాలయాలలో పిజి సీట్లను భర్తీ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది మొదటి సారిగా ఈ పరీక్షలను ఆన్‌లైన్ విధానంలో నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పాత పది జిల్లా కేంద్రాలతో సహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మొత్తం 25 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 61,500 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఒయు డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. కిషన్ పేర్కొన్నారు. పరీక్షా ప్రశ్నాపత్రం కీలను రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. వాటిపై ఏవైనా అభ్యంతరాలుంటే తమ కార్యాలయంలో సంప్రదించాలని అభ్యర్థులకు సూచించారు. రెండు వారాల్లో రెండు వారాల్లో ఫలితాలను వెల్లడించనున్నారు.

Comments

comments