Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

పాక్‌లో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం…

pak

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రభుత్వం జమ్మూ కశ్మీర్ అంశానికి సంబంధించిన విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ లోని ప్రైవేటు పాఠశాలలో సోషల్ స్టడీస్ పుస్తకాలపై నిషేధం విధించింది. పాకిస్థాన్ మ్యాపుల్లో కశ్మీర్ ఇండియాలో అంతర్భాగమని చూపించడమే ఈ నిషేధానికి  కారణం కావడం గమనార్హం. ఆ పాఠ్యపుస్తకాలలో ముద్రించిన పాకిస్థాన్ మ్యాప్ లో కశ్మీర్ భూభాగం భారతదేశంలో భాగమని చూపిస్తుండటంతో వాటిపై నిషేధాన్నివిధిస్తూ ఆదేశాలు జారీ చేేశారు. 2, 4, 5, 7, 8 తరగతులు విద్యార్థులకు సంబంధించిన సోషల్ స్టడీస్ బుక్స్ లో వివాదాస్పద, అభ్యంతరకరమైన విషయాలు ఉన్నాయని పాక్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్థాన్ మ్యాప్ ల్లో కశ్మీర్ భారత్ లో ఉన్నట్టు గుర్తించినట్టు పంజాబ్ కరికులమ్, టెక్స్ బుక్ బోర్డ్  (పిసిటిబి) ఒక ప్రకటనలో వెల్లడించింది. పంజాబ్ ప్రావిన్స్ లో వెంటనే  ఆ పుస్తకాలను నిలపివేయాలని పిసిటిబి మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ కయ్యూమ్ నోటీఫికేషన్ విడుదల చేశారు. విద్యాసంస్థల నిర్వాహకులతో పాటు తప్పు చేసిన పబ్లిషర్స్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లాహోర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ప్రభుత్వ సంస్థ అయిన పిసిటిబి తెలిపింది.

Comments

comments