Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

సమరానికి సై…

Panchayat elections in three installments

మన తెలంగాణ/సూర్యాపేట : గ్రామ పంచాయితీ ఎన్నికలను జిల్లాలో మూడు విడతల్లో నిర్వహించేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వచ్చే నెలలో స్థానిక పోరుకు ప్రభుత్వం సన్నద్దం కావడంతో జిల్లా యంత్రాంగం ఈ ఏర్పాట్లపై కసరత్తు చేస్తోంది. అధికారులు, సిబ్బంది అంతా ఐదు వేల మందికి పైగా ఎన్నికల విధులు వేయనున్నారు. వచ్చే నెల చివరి నాటికి జిల్లాలో పంచాయితీ పాలక వర్గాల గడువు ముగియనుంది. ఈ నెలలోనే ఎన్నికలు నిర్వహించను న్నామ ని, సిద్ధంగా ఉండాలని బుధవారం రాజధానిలో ఎన్నికల సంఘం… కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయితీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టత ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఒక్కొక్కటి పూర్తి చేస్తోంది. గురువారంతో బీసీ ఓటర్ల గణన కూడా పూర్తయింది. శనివారం అన్ని గ్రా మ పంచా యితీల్లో బీసీ ఓటరు జాబితా ప్రదర్శించారు. ఒక పంచా యితీల వారీ గా రిజర్వేషన్లు 10 నాటికి తేల నుం ది. జిల్లాలో పాత, కొత్త గ్రామ పంచా యితీ లు మూ డు విడత ల్లో ఎన్నికలు నిర్వ హించనున్నారు. తొలి విడత లో ఎని మిది మండలాల్లోని 156 పంచా యితీలు, 1422 వార్డులు, రెండో విడతలో ఏడు మండలాల్లోని 161 పంచా యితీలు, 1456 వార్డులు, మూడో విడతలో ఎనిమిది మండ లాల్లోని 158 గ్రామాలు, 1444 వార్డుల్లో ఎన్నికలు జరుగ నున్నాయి. స్టేజ్ 1 అధికారులు 142 మంది, ప్రిసైడింగ్ అధి కారులు రెండు వేల మంది, ఎన్నికల సిబ్బంది 1700 మందిని ఎన్నికల నిర్వహణకు వినియోగిం చనున్నారు. మొత్తం 4322 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఇందులో ప్రభుత్వ పాఠ శాలలు, కార్యాలయాల్లో 4243, ప్రైవేటు భవనాల్లో 79 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.
మండలాల వారిగా మూడు విడతల్లో
జిల్లాలోని మండలాల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వ హించేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. మొదటి విడతలో సూర్యాపేట, ఆత్మకూర్(ఎస్), తుంగతుర్తి, నాగారం, నూతన కల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే రెండో విడతలో కోదాడ, అనంతగిరి, మోతె చివ్వెంల, పెన్‌పహాడ్, మునగాల నడిగూడెం మండలాలు, మూడో విడతలో హుజూ ర్‌నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మఠంపల్లి, పాలకీడు, చిలుకూ రు, మేళ్లచెరువు, చింతలపాలెం, మండలాల్లో నిర్వహిం చను న్నట్లు తెలిసింది. అధికారులు ప్రాథమికంగా ఇలా మండ లా ల్లో మూడు విడతలుగా షెడ్యూల్ తయారు చేసి, ఇందుకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రధాన శాఖలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. నోటిఫికేషన్ నాటికి ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేయడం… లేకపోతే యథా విధిగా ఎన్నికలు నిర్వహించనున్నారు.
సమస్యాత్మక పంచాయతీలు 62
గతంలో జరిగిన ఎన్నికలు, హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని పంచాయితీల వారీగా పోలీస్ శాఖ కూడా జిల్లాలో అతి సమస్యాత్మక పంచాయితీలను గుర్తించింది. జిల్లాలో 62 పంచాయితీలను సమస్యాత్మక, 267 పంచాయితీలను ఎలాం టి సంఘటనలు లేకుండా గుర్తించినట్లు సమాచారం. ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం నుండి కూడా స్పష్టత రావడంతో ఈ గ్రామ పంచాయితీలపై నోటిఫికేషన్ వెలువడ గానే పోలీస్ శాఖ నిఘా పెట్టనుంది. పోలీంగ్ సమయంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు తీసుకో వాలని ఎన్నికల సంఘం ఆదేశిం చడంతో ఈ గ్రామాల్లో బందో బస్తుపై పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా అతిసమస్యాత్మక గ్రామాల్లో ఎక్కువగా పోలీస్ బలగాలను మోహరించనున్నారు. ఎన్నికల సంఘం సూచనలతో జిల్లాకు ఎంతమంది.
గులాబి రంగులో సర్పంచ్ బ్యాలెట్ పత్రం
సర్పంచ్ బ్యాలెట్ పత్రం గులాబి రంగులో ఉంటుంది. సర్పంచ్ పదవికి పోటీపడే వారికి 30 గుర్తులు కేటాయించారు. ఉంగరం, కత్తెర, బ్యాలెట్ కప్పు సాసర్, విమా నం, బంతి, షటిల్, కుర్చీ, వంకాయ, నల్లడోర్డు, కొబ్బరికాయ, మహిళా పర్సు, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటి పండు, మంచము, వేణువు, ఫోర్కు, చెంచా గుర్తులున్నాయి. అభ్యర్థుల పేర్ల క్రమంలో కేటాయిస్తారు.
వార్డు సభ్యులకు 20 గుర్తులు
వార్డు సభ్యుడి బ్యాలెట్ పేపర్ తెలుపు రంగులో ఉంటుంది. వీటికి 20 గుర్తులు కేటాయించారు. జగ్గు, గౌను, గ్యాస్‌పోయి, స్టూల్, గ్యాస్ సిలిండర్, గాజు గ్లాసు, విల్లు బాణము, కవరు, హాకీ, బంతి, నెక్ బై, కటింగ్ ప్లేయర్, పోస్టు డబ్బా, విద్యుత్తు స్తంబం గుర్తులు కేటాయించారు.

Comments

comments