Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పటిష్టమైన పంచాయతీరాజ్ వ్యవస్థ

5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల వ్యయం

గ్రామాలే అభివృద్ధికి పట్టుగొమ్మలు అనే విధానంతో ఒకవైపు వ్యవసాయ రంగాన్ని, మరోవైపు గ్రామీణాభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి అనేక పథకాలను ప్రవేశపెట్టింది. తండాలను పంచాయతీలుగా చేసి అభివృద్ధికి బీజం వేసే సంచలన  నిర్ణయాన్ని తీసుకుంది. గ్రామజ్యోతి, మన ఊరు మన ప్రణాళిక లాంటి పలు విధాన నిర్ణయాలు చేసింది. నూతన పంచాయతీరాజ్ చట్టానికి పలు  సవరణలు చేసి గ్రామీణాభివృద్ధి ఊపందుకునేలా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడేలా వెసులుబాటు కల్పించింది.

Panchayat System Strong in Telangana

గ్రామాభివృద్ధిలో కీలకం గ్రామజ్యోతి

రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం గ్రామజ్యోతి పథకాన్ని 2015 ఆగస్టు 15న ప్రారంభించింది. దీని అమలు కోసం అయిదేళ్లలో రూ.25వేల కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించింది. ప్రతీ ఏటా రూ.5 వేల కోట్లను ఖర్చుచేస్తోంది. గ్రామాల అభివృద్ధికి ఏ పనులు కావాలో ఆ గ్రామాలు నిర్ణయించుకోవడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఆ పనులకయ్యే నిధిని ప్రభుత్వమే మంజూరుచేస్తుంది. ఈ పథకం కింద ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీస్ అధికారులు 2587 గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఇప్పటివరకు 7829 శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొత్తగా 1630 శ్మశాన వాటికలను ప్రభుత్వం మంజూరుచేసింది. చెత్త సేకరణకు 19587 రిక్షాలను పంచాయతీలకు పంపిణీ చేసింది. 2015-16లో రూ.2542 కోట్లతో 2,17,896 పనులు, 2016-17లో రూ.2919 కోట్లతో 2,28,099 పనులను చేపట్టింది. ప్రస్తుతం 60,788 మంది ఫంక్షనల్ కమిటీ సభ్యులకు ప్రణాళికల తయారీపై శిక్షణ ఇస్తోంది.

మనఊరు-మన ప్రణాళికతో ప్రగతిపథంలో పల్లెలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మన ఊరు -మన ప్రణాళిక’ కార్యక్రమంతో పల్లెలు ప్రగతిపథంలో నడుస్తున్నాయి. ఎక్కడో ఉన్న పల్లె అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులు హైదరాబాద్‌లో ఉన్న ఉన్నతాధికారులు నిర్ణయించడం వల్ల సరైన పనుల నిర్ధారణ జరగక పల్లెల్లో అభివృద్ధి కుంటుపడుతోందని భావించిన ప్రభుత్వం ఏ ఊరికి ఏమి కావాలో, ఏమండలానికి ఏమి కావాలో వారే నిర్ణయించుకునేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా తయారైన ప్రణాళికలకు రూ.48,263 కోట్ల మేరకు ఖర్చయ్యే 64,795 పనులను అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీలకు రూ.17,634 కోట్లతో 60,039 పనులు మంజూరయ్యాయి. 438 మండల ప్రజాపరిషత్‌లకు రూ.13,789 కోట్లతో 4380 పనులు, 9 జిల్లా పరిషత్‌లకు రూ.17,439 కోట్లతో 376 పనులను ప్రభుత్వం మంజూరుచేసింది.

వెనుకబడిన మండలాల్లో ‘పల్లె ప్రగతి’

రాష్ట్రంంలో అత్యంత వెనుకబడిన 150 మండలాలను గుర్తించిన ప్రభుత్వం అభివృద్ధి కోసం ‘పల్లె ప్రగతి’ని అమలుచేస్తోంది. దీని కోసం కేంద్రం రూ.642 కోట్లు కేటాయించి రూ.450 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.192 కోట్లు మంజూరుచేసింది. 2020 వరకు కొనసాగే ఈ కార్యక్రమం కింద 2.5 లక్షల మంది పేద ఉత్పత్తిదారుల ఆదాయాన్ని 50శాతం పెంచేందుకు, వారి ఉత్పత్తులకు తగిన ధర వచ్చేలా మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశాయి. 48 మండలాల్లో 37వేల మంది ఉత్పత్తిదారులతో 19 వరి ఉత్పత్తి సంస్థలు, 50 మందితో 10 పాల ఉత్పత్తి సంస్థలు, 36 మండలాల్లో 50 వేల మంది ఉత్పత్తిదారులతో 18 పౌల్ట్రీ ఉత్పత్తి సంస్థలు, 40 మండలాల్లో 80 వేల మంది ఉత్పత్తిదారులతో 40 చిన్న పశు ఉత్పత్తి సంస్థలు, 5 మండలాల్లో 5 వేల మందితో 40 విత్తన ఉత్పత్తి సంస్థలు, 4 మండలాల్లో 4 వేల మందితో 4సోయాబీన్ ఉత్పత్తి సంస్థలు ఏర్పాటుచేసుకున్నారు.

కూరగాయల రైతులకు పెరిగిన ఆదాయం

కూరగాయలు పండించే రైతుల ఆదాయం పెంచడంతో పాటు వాటి సాగును పెంచడంలో ప్రభుత్వం గణనీయమైన ప్రగతిని సాధించింది. దీని కోసం ‘ మన ఊరు – మన కూరగాయలు’ అనే పథకాన్ని ప్రారంభించి సమర్థవంతంగా అమలుచేస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా అమలువుతున్న ఈ పథకం ద్వారా రైతు పండించిన కూరగాయలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నాణ్యమైన, తాజా కూరగాయలను సరసమైన ధరలకు వినియోగదారులకు అందుతున్నాయి. రైతులు పండించిన కూరగాయలను సేకరించి ఆడబ్బును నేరుగా రైతు ఖాతాలో జమచేస్తారు. దీంతో రైతు ఆదాయం మార్కెట్ ధరలో 25 శాతం నుంచి 64 శాతం పెరిగింది. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో 40 మన ఊరు మన కూరగాయలు కేంద్రాలను ప్రారంభించారు. త్వరలో మరో 60కేంద్రాలను ఏర్పాటు చేయాలని లక్షంగా నిర్ణయించుకుని ఆదిశగా ప్రభుత్వం ముందుకు పోతోంది. 2017 మే 19న ఈ కేంద్రాలను ప్రారంభించి మూడు నెలల్లోనే 2017 అక్టోబర్ నాటికే 73,450 మంది రైతుల నుంచి 1.98లక్షల క్వింటాళ్ల కూరగాయలను కొనుగోలు చేసి వారికి రూ.17.02కోట్లు చెల్లించారు.

నూతన చట్టంతో పాటు నేరుగా నిధులు

గ్రామ పంచాయతీలను శక్తివంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టంతో గ్రామాల స్వూరూపం మారిపోయింది. ఈ చట్టం ద్వారా 500 కం తక్కువ జనాభా ఉన్నప్పటికి పంచాయతీలుగా ఏర్పాటయ్యాయి. దీంతో రాష్ట్రంలో పంచాయతీల సంఖ్య 12751కి పెరిగింది. 1326 ఎస్‌టి, 1311 షెడ్యూల్డ్ ఏరియా గ్రామపంచాయతీలు ఏర్పడ్డాయి. సర్పంచ్, ఉపసర్పంచ్‌కు ఉమ్మడి చెక్‌పవర్, సర్పంచ్‌కు విశేషాధికారాలు కల్పించడంతో గ్రామాభివృద్ధికి కీలక బాట పడింది. చిన్న పంచాయతీలైతే నిధులు లేక అభివృద్ధి జరగదని భావించి రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా పంచాయతీలకు బడ్జెట్‌లో నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.1500 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1000 కోట్లను కేటాయించింది. నగర పంచాయతీల స్థానంలో మున్సిపాల్టీలు ఉనికిలోకి వచ్చాయి.

ఎస్. శశికాంత్

Comments

comments