Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు

Panchayath Elections Preparation Officers in Siddipet

మనతెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి : పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లాలోని రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. మంగళవారం మండల కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసేలా జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దౌల్తాబాద్‌లలో ఈనెల 12 నుంచే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దశల వారీగా రిటర్నింగ్ అధికారులకు శిక్షణా తరగతులు ఇస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని  499 గ్రామ పంచాయతీలకు గాను 580 రిటర్నింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఈ శిక్షణలో నిత్యం 50 నుంచి 60 మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు విధి నిర్వహణలో జాగ్రత్తగా వ్యవహరించి ఎన్నికలను సజావుగా జరపాలని సూచించారు. ఈ సమావేశంలో డిపివో సురేశ్ బాబు, ఎంపిడిఒ సమ్మిరెడ్డి, శిక్షకులు తిరుపతి, రమేశ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments