Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

ప్రేమ, వినోదం పుష్కలంగా…

gopi

గోపీచంద్ హీరోగా కె.చక్రవర్తి దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న చిత్రం ‘పంతం’. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటల చిత్రీకరణ కోసం సినిమా యూనిట్ యుకెకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఫారిన్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్‌కు చేరుకుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. సినిమాలో ప్రేమ, వినోదం వంటి అంశాలు పుష్కలంగా ఉండబోతున్నట్లు టీజర్‌తో శాంపిల్ చూపించారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ సినిమాను జూలై 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు.

Comments

comments