Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రజావాణికి సమస్యల వెల్లువ

 Pass books are not given to 20 tribal farmers

మనతెలంగాణ/కామారెడ్డి: జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయానికి సోమవారం ప్రజా సమస్యల విన్నపాలు అసంఖ్యాకంగా వచ్చాయి. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజలు విన్నపాలను కలెక్టర్ సత్యనారాయణ, జెసి సత్తయ్య స్వీకరించారు. జిల్లాలోని పోతురాజులు తమకు జీవనోపాధి కల్పించాలని భూమి, పెన్షన్లు మంజూరు చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. బిచ్‌కుంద మండలంలో అకాల వర్షాలకు నష్టపోయిన పంటలకు నష్ట పరిహారాలు ఇవ్వాలని రైతులకు కోరారు. బండరేంజల్ గ్రామంలో రాళ్ల వర్షంతో చెడిపోయిన పంటలకు పరిహారం అందించాలని రైతులు కోరారు. లింగంపేట మండలం మారుమూల గ్రామమైన కంచుమల్ గ్రామంలో విద్యార్థులందరినీ బడుల్లో చేర్పించాలని వారికి పుస్తకాలు ఉచితంగా అందించాలని విద్యాశాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

గాంధారి మండలం సంగెం గ్రామంలో 20 మంది గిరిజన రైతులకు పాసు పుస్తకాలు ఇవ్వలేదని దాంతో విత్తనాలు ఇవ్వడం లేదని రైతులు కలెక్టర్‌కు మెమోరాండం ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో బోరుకు తాళం వేయడంతో నీటి కటకట ఏర్పడిందని పలువురు మహిళలు కలెక్టర్‌కు విన్నవించారు. రామారెడ్డికి చెంది యండి కలీల్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలని అభ్యర్థించారు. మాచారెడ్డి అక్కాపూర్ గ్రామానికి చెందిన బాలయ్య తన పాసు పుస్తకంలో భూమిని తక్కువగా నమోదు చేశారన్నారు. యంఆర్‌ఒ, పట్వారీలను కలిసినా ప్రయోజనం లేదన్నారు. తనకు ఎకరంన్నర భూమి తక్కువగా నమోదైందని కలెక్టర్ దృ ష్టికి తీసుకువచ్చారు. మాచారెడ్డి మండలం భవానిపేట తండా గిరిజన మహిళలు నర్సరీలో పని చేసిన తమకు కూలీ డబ్బులు చెల్లించడం లేదని ఫిర్యాదు చేశారు.
ఏయిడ్స్ (హెచ్‌ఐవి) వ్యాధిగ్రస్థులు సుమారు యాభై మంది తమకు లోన్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కలెక్టర్‌కు మొమోరం డం సమర్పించారు. ఆర్థిక సమస్యలను ఎండిఒలకు చెబితే పట్టించుకోవడం లేదని వ్యాధిగ్రస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వర్డ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాధితులు కలెక్టర్‌ను కలిశారు. వెంటనే లోన్లు మంజూరు చేయాలని బిసి కార్పొరేషన్ పిడి దేవిదాసును కలెక్టర్ ఆదేశించారు.
ప్రజావాణికి 46 పిటీషన్లు
కలెక్టర్ ప్రజావాణికి సోమవారం నాడు 46 వినతులు వచ్చాయని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. రెవెనూ, మత్స, డిపిఒ, బిసి కారొర్పోరేషన్, వ్యవసాయ, పోలీసు, ఎస్‌సి కార్పొరేషన్, విద్యా, లీడ్ బ్యాంకు, మున్సిపల్, ఆబ్కారీ శాఖలకు సంబంధించి వినతులు వచ్చాయని సత్వర పరిష్కారానికి జిల్లా స్థాయి అధికారులకు సిఫారసు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్‌తోపాటు జెసి సత్తయ్య, ట్రైనీ ఐఎఎస్ వెంకటేష్, గ్రామీణ అభివృద్ధ్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments