Search
Saturday 23 June 2018
  • :
  • :
Latest News

పాస్‌బుక్ వివరాలు ధరణిలో అప్‌లోడ్ చేయాలి

Passbook details must be uploaded in the Darani website

మన తెలంగాణ/వరంగల్ అర్భన్‌జిల్లా ప్రతినిధి : వివిధ కారణాలతో పక్కన పెట్టిన పాసుబుక్కులను సవరించి, అట్టి వివరాలను ధరణి మొబైల్ ఆప్‌లో అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ యం. హరిత అన్నారు. మంగళవారం పట్టాదారు పా సుబుక్కుల పంపిణీ, ఆన్‌లైన్‌లో నమో దు అంశాలపైన అన్ని మండలాల తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ మాట్లాడారు.డబుల్‌బెడ్ రూం (2బిహెచ్‌కె) గృహాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా అర్హులయిన లబ్ధిదారులనే అధికారులు ఎంపిక చేయాలని వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ యం.హరిత అన్నారు. మంగళవారం కలెక్టర్ తమ క్యాంపు కార్యాలయంలో నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట మండలాలలో డబుల్‌బెడ్ రూం గృహాల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం నర్సంపేట మండలంలోని మాదన్నపేట గ్రామంలో 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని అదే విధంగా గురజాలలో 56 మందిని, దుగ్గొండి మండలంలో 29, మర్రిపల్లిలో 22, తిమ్మంపేటలో 23, చెన్నారావుపేట మండలంలో 64 మంది, అమీనాబాద్ గ్రామంలో 48 మందిని మొత్తం 267 మంది లబ్ధిదారులను ఎంపిక చేయడంతో పాటు 267 డబుల్‌బెడ్ రూం గృహ నిర్మాణాలు టెండర్ ప్రాసెస్‌లో వున్నాయని కలెక్టర్ తెలిపారు. మండలంలో లబ్ధిదారుల వివరాలను స్థానిక తహసిల్దార్ ద్వారా పరిశీలించాలని తద్వారా లబ్ధిదారుల ఎంపికలో స్పష్టత ఏర్పడుతుందని భవిష్యత్‌లో ఎలాంటి అభ్యంతరాలు తలెత్తవని కలెక్టర్ అధికారులకు సూచించారు. పైన పేర్కొన్న 267 2 బిహెచ్‌కె లబ్ధిదారుల విషయంలో కూడా సంబంధిత మండలాల తహసిల్దార్లతో మరొకసారి పరిశీలించి కన్‌ఫర్మ్ చేసుకొని అట్టి లబ్ధిదారుల నివేధికను సమర్పించాలని కలెక్టర్ నర్సంపేట ఆర్‌డిఓ రవిని ఆదేశించారు. అనంతరం సంబంధిత కమిటీ సమావేశంలో పాలనా పరమైన అనుమతికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. లబ్ధిదారుల ఎంపికను పూర్తి పారదర్శకంగా ప్రభుత్వ నిబంధనలు మేరకు గ్రామ సభ నిర్వహించి ఎంపిక చేస్తున్నామని ఆర్‌డిఓ రవి కలెక్టర్‌కు వివరించారు. సమావేశంలో పిడి డిఆర్‌డిఓ శేఖర్‌రెడ్డి, డిఇ పంచాయితీ రాజ్, ఏఓ డిఆర్‌డిఓ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments