Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి

 Percentage subsidy for the cost of agribusinessమన తెలంగాణ/భూపాలపల్లి : జిల్లా సర్వతో ముఖాభివృద్ధికి అధికారులు, ప్రజ లు పునరంకితం కావాలని తెలంగాణ శా సన సభా స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం జయశంకర్ జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తెంలగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఆధ్యక్షతన స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఘనంగా న్విహించారు. ఈ కార్యక్రమానికి శాసన సభా స్పీకర్ సిరికొండ మధుసూధనాచారి ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. తరువాత సైనిక వందనం స్వీకరించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జిల్లాలో ప్రధానంగా వ్యవసాయం వృత్తిగా బతుకుతున్న రైతులకోసం రాష్ట్రప్రభుత్వం చేపట్టిన రైతుబంధు కార్యక్ర మం ద్వారా జిల్లాలో 560 రెవెన్యూ గ్రామాల్లో ఒక ల క్షా 64 వేల 507 మంది రై తులకు 137 కోట్ల రూపాయల విలువైన 1లక్షా 65 వేల 166 చెక్కులను పంపి ణీ చేయడం జరిగిందన్నా రు. జిల్లాలో కరీఫ్ కాలానాకి 11వేల 242 క్వింటాళ్ల వరి,కందులు,పెసర,మెక్కజోన్న ఇతర విత్తనాలను రైతులకు రాయితిలో అందించడం జరిగిందని పేర్కోన్నారు.

వ్యసాయ యాంత్రీకరణ కోసం 50 శాతం సబ్సిడీతో 10 కోట్ల 57 లక్షల రూపాయల విలువైన ట్రాక్టర్లు ఇతర మంత్రలను అందిచడం జరిగిందన్నారు.జిలాల్లో 76 మంది వ్యసాయ విస్థరణ అధికారులను నియమించడం జరిగిందని ఎప్రిల్ మాసంలో కురిసిన వడగళ్ల వానల వలన నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహరం అందించుటకు నివేదికలు పైఅధికారులకు నివేధక పంపడ జరగిందని తెలిపారు. 14 కోట్ల ఎన్‌ఆర్‌ఇజిఎస్ నిదులతో కొత్త గ్రామంచాయితి భవనాలు, అంగన్ వాడీ సెంటర్లు , వ్యవ సాయ గోదాములు నిర్మాణం జరుగుతుంది.ప్రపంచమే ఆచర్యపోయేలా అతివేగం గా నిర్మాణం జరుగుతున్న కాళేశ్వర ఎత్తిపోతల పథకం మన జిల్లాలో ఉండ టం మనందరికి గర్వకారణం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపడుతున్న కాళేశ్వరం ప్రాజేక్ట్ పూర్తయితే రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల వ్య వసాయ భూమి సాగులోకి రావడంతో పాటు మరో 18లక్షల ఎకరాల భూ మి సాగులోకి వస్తుందని కోటి ఎకరాలకు సాగునీరందించాలనే రాష్ట్రప్రభు త్వ ఆశయానికి ఉయోగపడనుందని తెలిపారు. ప్రజాసమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించేందుకే గ్రామాల్లో పల్లె ప్రగతి నిద్ర చేస్తున్నాని అన్నివర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ పనులు చేపడుతున్నామన్నారు. జిల్లా అభివృద్ధికి సహకస్తున్న అధికారులకు.నాయకులకు,జర్నలిస్టులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఆర్‌భాస్కరన్, డిఆర్‌ఒ మోహన్ లాల్,ఆర్‌డిఒ వీరబ్రహ్మచారి,జిల్లా వ్యవసాయ అధికారిని అనురాధ, జిల్లావైద్య అధికారి అప్పయ్య అన్ని శాఖల అధికారులు పాల్గోన్నారు.

Comments

comments