Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

నడిరోడ్డుపై విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!(వీడియో)

Plane Emergency Landing on Highway in Los angeles by Women Pilot

లాస్‌ ఏంజిల్స్‌: అది ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైవే. కానీ ఉన్నట్టుండి ఆ రహదారిపై ఓ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయింది. దాంతో వాహనాదారులు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియక హడలెత్తిపోయారు. నడిరోడ్డుపై విమానం ల్యాండ్ అవడం ఏమిటని వారు కాసేపు షాక్ లోనే ఉండిపోయారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన అగ్రరాజ్యం అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపిస్తోంది.

అసలేం జరిగిందంటే… సెస్నా 172 రకానికి చెందిన ఓ తేలికపాటి విమానం జాన్‌ వెయిన్‌ విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానాశ్రయానికి తిరిగి వెళ్లేలోపు ఇంజిన్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయింది. దాంతో వెంటనే విమానంలోని మహిళా పైలట్‌ అత్యవసరంగా హంటింగ్టన్‌ బీచ్‌ రోడ్డుపై ల్యాండ్‌ చేసింది. ప్రస్తుతం మహిళా పైలట్ ట్రైనింగ్ లో ఉన్నట్లు తెలిసింది. కాగా, ఇది అత్యంత అరుదైన ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అని, పైలట్‌ అద్భుతం సృష్టించారని కొందరు ఏవియేషన్‌ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఘటనతో వాహదారులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, పైలట్ చాకచక్యంతో వ్యవహరించారని లాస్‌ ఏంజిల్స్‌ పోలీసులు వెల్లడించారు.

Comments

comments