Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

విత్తనోత్పత్తికి అపార అవకాశాలు

Pocharam Srinivas Reddy Speech About Khariff Cultivation

మనతెలంగాణ/బోధన్: తెలంగాణ రాష్ట్రం లో విత్తనోత్పత్తికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లి సాయిబాబ మందిర్ ఆవరణలో విత్తనోత్పత్తిపై శుక్రవారం జిల్లా,మండల రైతు సమన్వయ కమిటీలు, రైతులకు విత్తన అభివృద్ధ్ది సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విత్తనోత్పత్తిపై ప్రభు త్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతు లు విత్తనాలను తయారు చేసి ప్రభుత్వ సంస్థ కు విక్రయించినట్లైతే సర్టిఫై విత్తనంపై 20 శాతం అధిక ధరతో బైబ్యాక్ అగ్రిమెంట్ ద్వారా రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు స్వయంగా ఫౌండేషన్ సీడ్ తయారు చేసే విధానాన్ని అలవర్చుకోవాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వాలు వ్యవసాయం దండగా అని హేళన చేశాయని, ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు కుటుంబం నుండి రావడంతో పాటు రైతుల కష్టాలు తెలిసిన వాడు కావడంతో దండగా అన్న వ్యవసాయాన్ని పండగలా చూపించారు. రైతుల కు అత్యధిక ఫ్రాధాన్యతను అందిస్తూ 24 గంటలు నాణ్యమైన విద్యుత్ తో పాటు రూ.8 వేలు ఎకరాకు సాగుకు సాయం కింద ఏడాదికి రూ.12 వేల కోట్లను ఖర్చు చేస్తుందన్నారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించిందన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో ఇంత వరకు ఏ ప్రభుత్వం కొనుగోలు చేయని మొక్కజొన్న, కందులను తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకుందన్నారు. వచ్చే ఆగస్టు నుండి రైతులకు రూ. 5లక్షల ప్రమాద బీమాను కల్పించి రైతు పేరిట ఏడాదికి వచ్చే ప్రీమియాన్ని రూ.2,271 ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఈ అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ గంప గోవర్థన్, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహ న్, ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రామరెడ్డి, కలెక్టర్ సత్యనారాయణ, జుక్కల్ ఎంఎల్‌ఎ హన్మంత్‌షిండే,కామారెడ్డి జిల్లా రైతు సమన్వయ కన్వీనర్ అంజిరెడ్డి, వర్ని ఏఎంసీ చైర్మన్ గంగారాం, వర్ని మండల రైతు సమన్వయ కన్వీనర్ శ్రీరాములు,రుద్రూర్ మండల కన్వీనర్ శంకర్,18 జిల్లాల రైతు సమన్వయ కన్వీనర్లు,నాయకులు ఉన్నారు.

Comments

comments