Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

సెల్‌ఫోన్ దొంగ అరెస్ట్… రూ.38 వేల నగదు స్వాధీనం

Police Arrested The Cellphone Thief

మన తెలంగాణ/ సంగారెడ్డి టౌన్ : అనుమానాస్పద, గుర్తుతెలియని వారి నుండి ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అనుమానం వస్తే తమకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ఈ నెల 2వ తేదిన కల్పగూర్ గ్రామానికి చెందిన బసవపురం నగేష్ అనే వ్యక్తి వద్ద ఉన్న రూ.38,800/-తో బస్టాండ్ వద్ద వేచిచూస్తుండగా రుద్రారం గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి నేను అటే వైపు వెళ్తున్న అని  మాయమాటలు చెప్పి సంగారెడ్డి శిల్పారామం ప్రక్కన గల పొదల్లోకి బైక్‌పై తీసుకొని వెళ్లి రూ.38,800నగదుతో పాటు సెల్‌ఫోన్‌ను అపహరించి పారిపోయాడు. ఈ కేసు పరిశోధనలో ఉండగా ఈ  నెల 4వ తేదిన మధ్యాహ్నం 2 గంటలకు నేరస్తుడు అనుమానాస్పద స్థితిలో సంచరిస్తుండగా కొత్తబస్టాండ్ పరిసరాలలో మప్టిలో ఉన్న పోలీసులు పట్టుకొని అనుమానంతో విచారణ  చేయగా ఆ తప్పును ఒప్పుకున్నాడని, దొంగిలించిన డబ్బు, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దొంగను చాకచక్యంగా పట్టుకున్న పరిశోధనాధికారి ఎస్‌ఐ రామక్రిష్ణారెడ్డి, సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.  కావున బస్టాండ్, తదితర ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు, సహాయం చేస్తామని నమ్మి మోసం చేసేవారి నుండి భధ్రంగా ఉండాలని అనుమానం వస్తే తమకు 100కు ఫోన్ చేయాలన్నారు.

Comments

comments