Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

కృష్ణానదిలో బాలుడి మృతదేహం

Police Find out Two Years Boy Dead Body In Krishna River

నాగార్జునసాగర: నాగార్జునసాగర్ జలాశయంలో 2 సంవత్సరాల బాలుడి మృత దేహంను పోలీసులు గుర్తించారు. విజయపురిసౌత్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం గుంటూరు జిల్లా విజయపురిసౌత్‌లోని లాంచీస్టేషన్ సమీపంలో ఉన్న కృష్ణవేణి పుష్కరఘాట్ వద్ద 2 సంవత్సరాల బాలుడి మృతదేహం నది పక్కన పడి ఉండటంను స్థానిక మత్స్యకారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాలుడి మృత దేహంను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడి మృతికి గల కారణాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడు ఎర్రటి బనీను ధరించి ఉన్నాడని ,బాలుడి సంబధితులు విజయపురిసౌత్ పోలీసులను సంప్రదించాలని కోరారు.

Comments

comments