Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పోలీసు వాహనం చోరీ

ఐదు గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు

Police-Vehicle

మన తెలంగాణ/సూర్యాపేట: పోలీసు వాహనం చోరీకి గురైం ది. పోలీసులు ఊరుకులు పరుగులు పెట్టి చివరకు ఐదు గంటల్లోనే చోరీకి గురైన పోలీసు వాహనాన్ని పట్టుకున్నారు. అయి తే వాహనం ఎత్తుకెళ్లిన దుండగుడు మాత్రం పరారీలో ఉన్నాడు. ఈ ఘటన సూ ర్యాపేట పట్టణంలో చోటుచేసు కుం ది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట రూరల్ సిఐ ప్రవీణ్‌కుమార్ తన డ్రైవర్‌తో కలిసి సుమో (టిఎస్ 09 పిఎ 1568) పోలీసు వా హనంలో శనివారం సాయంత్రం 6 గంటలకు యూనివర్సల్ జిమ్ సెంటర్‌కు వచ్చాడు. సిఐ జిమ్‌లోకి వెళ్లగా.. డ్రైవర్ సుమోను జిమ్ ముందు పార్క్ చేశాడు. ఇం తలో ఓ అగంతకుడు డ్రైవర్ వద్దకు వచ్చి దృష్టి మరల్చి పోలీసు వాహనాన్ని ఎత్తుకెళ్లాడు. విషయం గమనించిన డ్రైవర్, సిఐకి సమాచారం అందించాడు. వెంటనే జిల్లా పోలీసులతో పాటు పొరుగు జిల్లాల పోలీసులను వైర్‌లెస్ సెట్‌లో అప్రమత్తం చేశారు.

జిల్లా సరిహద్దుల్లోని అన్ని రహదారులపై నాఖాబంధి నిర్వహించారు. అయితే దుండగుడు పోలీసు వాహనంలో వెళ ముందు చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట రూరల్ సిఐ ప్రవీణ్‌కుమార్ పోలీసు వాహనంలో డ్రైవర్ తో శనివారం జిమ్‌లోకి వెళ్లగా డ్రైవర్ దృష్టి మరల్చిన అగంతకుడు పోలీసు వాహనంతో పరారయ్యాడు. జిపిఎస్ సహాయంతో అగంతకుడు కోదడా వద్ద కట్టతుమ్ముగూడం క్రాస్‌రోడ్డు దాటుతుండగా పోలీసులు గుర్తించి సుమోను ఆపారు. అగంతకుడు వాహనం వదిలి పారిపోయాడు. అయితే అగంతకుడు సూర్యపేటకు చెందిన తిరుపతి లింగరాజుగా గుర్తించారు. పోలీసు వాహనంలో అతను ఖమ్మం జిల్లా చింతకాయ ల మండలం జగన్నాథపురంలోని తన అత్తగారింటికి వెళ్తుండ గా పట్టుబడినట్లు సూర్యపేటా ఎస్‌పి ప్రకాష్‌జాదవ్ తెలిపారు.

Comments

comments