Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

క్రేజీ ప్రాజెక్ట్

pooja

రొట్టె విరిగి నెయ్యిలో పడడం అంటే ఇదే. ‘డీజే’ బ్యూటీ పూజా హెగ్డే వరుసగా క్రేజీ ప్రాజెక్టులకు సంతకాలు చేస్తూ దూసుకుపోతోంది. ఊపిరిసలపని షెడ్యూళ్లతో ఈ ముద్దుగుమ్మ సినిమాలు చేస్తోంది. పూజ నటిస్తున్నవన్నీ భారీ ప్రాజెక్టులే. ఓవైపు ఎన్టీఆర్ సరసన ‘అరవింద సమేత…’ చిత్రం ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. మరోవైపు మహేష్, వక్కంతం వంశీ క్రేజీ కాంబినేషన్ సినిమాకు సంతకం చేసింది ఈ బ్యూటీ. తదుపరి ప్రభాస్ సరసన ‘జిల్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పూజ నటించనుంది. ఇన్ని సినిమాలు క్యూలో ఉన్నా ఈ భామ బాలీవుడ్‌లో ఓ క్రేజీ ప్రాజెక్టుకు సంతకం చేసింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటించనున్న ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందని పూజాహెగ్డే స్వయంగా ట్విట్టర్‌లో వెల్లడించింది. ఎస్‌జిఇ మూవీస్ పతాకంపై ఈ చిత్రం తెరకెక్కనుంది. సాజిద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అక్షయ్, రితీష్ దేశ్‌ముఖ్, కృతిసనన్, పూజాహెగ్డే, బొమన్ ఇరానీ ప్రధాన పాత్రల్లో నటిస్తారు.

Comments

comments