Search
Tuesday 19 June 2018
  • :
  • :

బాధ్యతాయుతంగా డ్యూటీ చేయాలి

 Posting at police stations To Civil Police

మన తెలంగాణ/మెదక్ క్రైం : పోలీస్ ఉద్యోగిగా ప్రజల సమస్యలను తీర్చగలిగే అవకాశం రావడం అదృష్టంగా భావించాలని జిల్లా ఎస్పీ చందనాదీప్తి అన్నారు. జిల్లాకు నూతనంగా కేటాయించిన 34 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 30 మంది రిజర్వ్‌డ్ కానిస్టేబుల్ (ఎఆర్)లకు జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో సివిల్ కానిస్టేబుల్‌లలో 16 మంది మహిళలు, 18 పురుషులు, ఏఆర్ కానిస్టేబుల్‌లలో నలుగురు మహిళలు, 26 మంది పురుషులు ఉన్నారు. ఈ సందర్భం గా జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ మీరందరూ కష్టపడి పోలీస్‌శాఖలో ఉద్యోగం సాధించారని, తల్లిదండ్రుల కలను సాకారం చేశారని, మనదంతా ఒక కుటుంబమని, కలిసికట్టుగా పనిచేసి జిల్లాకు, పోలీస్‌శాఖకు మం చి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రజల సమస్యల ను తీర్చగలిగే అవకాశం రా వడం ఓ అదృష్టమన్నారు. విధి నిర్వహణలో చట్టం పరిధిలో ఉంటూ మానవీయ కోణంలో ఆదరణ వంటి లక్షణా లు పోలీస్ ఉద్యోగిని సమాజంలో అత్యున్నత స్థాయిలో నిలబెడుతాయన్నారు. పోలీస్ ఉద్యోగం అంటే అధికారమని కాకుండా ఒక బాధ్య గా విధు లు నిర్వహించాల ని, ప్రజల కు అనుగుణం గా ఉండి వారి మనోభావాలను గుర్తించి ఫ్రెండ్లీ పో లీసింగ్ అని నిరూపించుకోవాలని సూచించారు. అదే విధంగా పవిత్రమైన పోలీస్ యూనిఫాం వి లువలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై  ఉందని, ప్రజలు, ఫిర్యాదుదారుల పట్ల బా ధ్యతాయుతంగా వ్యవహరించి నిష్పక్షపాతంగా బాధితులకు న్యాయం చేయాలని హితబోధనిచ్చారు. ముఖ్యంగా నెలవారిగా తీసుకునే జీతం ప్రజలు కట్టే ట్యాక్స్ నుండి రావడం జరుగుతుందని, ప్రజలకు సేవకులుగా పనిచేస్తూ వారి మన్ననలను పొందాలని సూచించారు. వర్గానికి, వ్యక్తులకు కాకుండా కులమతాలకు అతీతంగా పనిచేయాలని, కానిస్టేబుల్ అని కష్టపడి పనిచేసి డిపార్ట్‌మెంట్‌కి మంచిపేరు తీసుకురావాలని నూతనంగా పోస్టింగ్ తీసుకున్న కానిస్టేబుళ్లకు ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఎస్పీ నాగరాజు తదితరులు ఉన్నారు.

Comments

comments