Search
Tuesday 19 June 2018
  • :
  • :

ప్రేమెంత పనిచేసే నారాయణ

ravi

జెఎస్‌ఆర్ మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో హరికృష్ణ జొన్నలగడ్డను హీరోగా పరిచయం చేస్తూ జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసే నారాయణ’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమైంది.  ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ “హరి చాలా బాగా డ్యాన్సులు చేశాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. ఈ సినిమా పాటలు, ట్రైలర్, కొన్ని సీన్స్ చూశాను. హరి చాలా బాగా నటించాడు. అతను భవిష్యత్తులో హీరోగా పేరుతెచ్చుకుంటాడు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. దర్శకుడుజొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ “నాకు ఎంతో ఇష్టమైన హీరో రవితేజ ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుల చేయడం చాలా ఆనందంగా ఉంది.  ఈ నెల చివరి వారంలో సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం”అని తెలిపారు. హీరో హరి మాట్లాడుతూ “తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. హీరోగా నాకు మంచి పేరు తెచ్చే చిత్రమిది”అని పేర్కొన్నారు. హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత, ఝాన్సీ, చిలుకూరి గంగారావు, ఏఆర్‌సి బాబు, రాహుల్ బొకాడియా తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథః జెఎస్‌ఆర్ మూవీస్, మాటలుః సుబ్బరాయుడు, సంగీతంః యాజమాన్య, పాటలుః వనమాలి, గోసల రాంబాబు, కెమెరాః పి.ఎస్.వంశీప్రకాశ్, ఎడిటర్‌ః జానకీరామ్.

Comments

comments