Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

హరితహారానికి మొక్కలు సిద్ధం

 Prepare the plants for the green honey

మన తెలంగాణ/కోహెడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న నాలుగో విడ త హరితహారానికి నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేస్తున్నారు. జూలై నుంచి కార్యక్రమం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పలు నర్సరీల్లో మొక్కల పెంపకంపై అధికారులు దృ ష్టి సారించారు. మొక్కల సంరక్షణను ఆదికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జూలైలో మొక్కలు నాటేందుకు అధికార యంత్రంగం సమాయత్తమవుతున్నారు.
ఐదు నర్సరీలు… 4.30లక్షల మొక్కల పెంపకం
మొక్కల పెంపకానికి ఐదు నర్సరీలను ఏర్పాటు చేశారు.ఈజీఎస్ ఆద్వర్యంలో కోహెడ, చెంచల్‌చేర్వుపల్లి, బస్వపూర్, మూడు నర్సరీలలో ఒక్కో నర్సరీలో లక్ష పది వేల చోప్పున 3.30లక్షల మొక్కలు, అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో కూరెల్ల, బత్తులవానిపల్లి గ్రామాలలోని నర్సరీలలో లక్ష చోప్పున రెండు లక్షల మొక్కలను పెంచుతున్నారు. మొత్తం 4.30లక్షల మొక్కలను పెంచుతున్నారు. నర్సరీల్లో మొక్కలతో పాటు నిడనిచ్చే, పూల, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. అయా నర్సరీల్లో ఇప్పటికే మొక్క లు నాటేందుకు వీలుగా పెరిగాయని అధికారులు చెబుతున్నారు.వచ్చే నెల వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నర్సరీలకు గ్రీన్ నెట్‌ల ఏర్పాటు..
ఎండలు మండిపోవడంతో నర్సరీల్లో మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ప్రత్యే క చర్యలను తీసుకుంటున్నారు. ఎండలకు మొక్కలు దెబ్బతినకుండా కొన్ని నర్సరీల్లో గ్రీన్ నెట్‌లను ఏర్పాటు చేశారు. సమయానికి మొక్కలకు నీరు అందించేందుకు కూలీలను నియమించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నీరు అందిస్తూ మొక్కలను కాపాడుతున్నారు. నర్సరీల్లో పెరుగుతున్న కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. అధికారులు నర్సరీలను పర్యవేక్షిస్తూ తగిన సూచనలు, సలహాలు సంబందిత నర్సరీల నిర్వహకులకు అందిస్తున్నారు.
హరితహారానికి మొక్కలు సిద్ధం చేస్తున్నాం : శిరీష, ఏపీఓ, కోహెడ
మండలంలో హరితహారంలో మొక్కలు నాటేందుకు ఈజీఎస్ ఆధ్వర్యంలో కోహెడ, చెంచల్‌చేర్వుపల్లి, బస్వపూర్ గ్రామాలలోని నర్సరీలలో 3.30లక్షల మొక్కలు పెంచుతున్నాం. అవసరమైన కూలీలను నియమించి వాటిని రక్షించేందుకు నీళ్లు పడు తూ ఎండ వేడి తగలకుండా నెట్‌లను ఏర్పాటు చే స్తున్నాం. మొక్క లు ఎండిపోకుం డా ఎప్పటికప్పు డు పర్యవేక్షిస్తూ చర్యలు తీసుకుంటున్నాం.ఎప్పుడు వర్షాలు కురిస్తే అప్పుడు మొక్కలను పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నాం.

Comments

comments