Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

అందుకే కిమ్‌తో కలిసి చర్చించా: ట్రంప్

President Donald Trump says war games are 'provocative and inappropriate'

సింగపూర్: సెంటోసా ద్వీపంలోని కెపెల్లా హోటల్‌లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం ఉదయం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ… నిన్నటి ఉద్రిక్తతలు.. రేపటి యుద్ధానికి దారితీయకూడదన్నారు. అందుకే కిమ్‌తో కలిసి చర్చించామని ట్రంప్ చెప్పారు. యుద్ధం ఎవరైనా చేయొచ్చు.. కానీ సాహసం ఉన్నవారే శాంతి ప్రక్రియ చేపడతారని ఆయన పేర్కొన్నారు. క్షిపణి ప్రయోగ కేంద్రాలన్నీ ధ్వంసం చేస్తామని కిమ్ హామీ ఇచ్చారని తెలిపారు. త్వరలోనే అణునిరాయుధీకరణ జరుగుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. మార్పు సాధ్యమేనని తామిద్దరం నిరూపించామన్నారు. ఉభయ కొరియాల ప్రజలు సామరస్యంగా జీవించాలని ఈ సందర్భంగా ట్రంప్ ఆకాంక్షించారు.

Comments

comments