Search
Wednesday 20 June 2018
  • :
  • :
Latest News

పొరుగుతో సంబంధాలు ముఖ్యం

int

దేశాలను కలుపుకెళ్లే ప్రాజెక్టులకు మద్దతు 

షాంఘై సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ 

కింగ్‌డావో: మెగా కనెక్టివిటీ ప్రాజెక్టులు ఆయా దేశాల సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతలను గౌరవించాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. చైనా చేపట్టిన భారీ ‘ బెల్ట్, రోడ్ కనెక్టివిటీ ప్రాజెక్టు’ను పరోక్షంగా ప్రస్తావిస్తూ మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్ని దేశాలను కలుపుకొని పోయే ప్రాజెక్టులకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. చైనాలోని రేవు పట్టణమైన కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ( ఎస్‌సిఓ) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో ఆదివారం ప్రసంగించిన మోడీ‘సెక్యూర్’కు కొత్త నిర్వచనం చెప్పారు. ‘భారత్ సెక్యూర్ విధానానికి కట్టుబడి ఉంది. ఇందులో ఎస్ అంటే భద్రత, ఇ అంటే ఆర్థికాభివృద్ధి, సి అంటే ప్రాంతాల వారీగా అనుసంధానం,యు అంటే ఐక్యత, ఆర్ అంటే సార్వభౌమాధికారం, సమగ్రతలను గౌరవించడం, ఇ అంటే పర్యావరణ పరిరక్షణ అని అర్థమని ఆయన అన్నారు. పొరుగు దేశాలతోను, ఎస్‌సిఓ సభ్య దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని మోడీ చెప్పారు. భూగోళం నిర్వచనాన్ని డిజిటల్, భౌతిక అనుసంధానం మార్చి వేస్తుందని, పొరుగు దేశాలతో సంబంధాలకు భారత్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన చెప్పారు. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ కారిడార్ ప్రాజెక్టులో భారత్ భాగస్వామి కావడం, చాబార్ పోర్టు అభివృద్ధి. అస్ఘాబాత్ ఒప్పందం దీనికి నిదర్శనాలని ఆయన చెప్పారు. చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ సమక్షంలోనే మోడీ ఆయన మానస పుత్రిక అయిన బెల్ట్, రోడ్ ప్రా.ఎక్టుగురించి పరోక్ష హెచ్చరిక చేయడ గమనార్హం. ఒక్క భారత్ మినహా షాంఘై సహకార సంస్థలోని మిగతా సభ్య దేశాలన్నీ ఈ ప్రాజెక్టుకు మద్దతు పలుకుతుండడం విశేషం.కనిక్టివిటీ అంటే భౌతిక కనెక్టివిటీ మాత్రమే కాదని, దానికి సంబంధించిన మాన వ సంబంధాల అంశం కూడా చాలా ముఖ్యమని చరిత్ర మనకు చెబుతోందని మోడీ అన్నారు. షాంఘై సదస్సు విజవంతం కావడానికి భారత దేశం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెపాపరు. భారత దేశానికి వస్తున్న పర్యాటకుల్లో కేవలం ఆరు శాతం మాత్రమే ఎస్‌సిఓ దేశాలకు చెందిన వారని ఆయన అంటూ, ఈ సంఖ్య మరింతగా పెరగాల్సిన అవసరముందని చెప్పారు. ఉగ్రవాదం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, అఫ్ఘానిస్థాన్‌లో చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటనలను ఉదహరించారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి అఫ్ఘా న్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తీసుకొంటున్న సాహసోపేత చర్యలకు అందరూ మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. భారత దేశంలో ఎస్‌సిఓ ఫుడ్ ఫెస్టివల్‌ను, బుద్ధిస్ట్ వారసత్వ సంపదపై ఒక ఎగ్జిబిషన్‌ను నిర్వహించనున్నట్లు కూడా ప్రధాని చెప్పారు. ఎస్‌సిఓ సదస్సులో భారత ప్రధాని పాల్గ్గొనడం ఇదే మొదటిసారి, చైనా, రష్యాల ఆధిపత్యం కలిగిన ఈ కూటమిలో భారత్, పాకిస్తాన్‌లు గత ఏడాదే పూర్తిస్థాయి సభ్యులుగా చేరిన విషయం తెలిసిందే. కాగా సదస్సులో స్రసంగించిన పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ చైనా చేపట్టిన బెల్ట్, రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులో భాగమైన చైనాపాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో కొంతభాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌గుండా వెళ్తుండడమే భారత్ అభ్యంతరానికి ప్రధాన కారణం.
భారత్, పాక్ చేరికతో మరిత బలోపేతం: జీ
షాంఘై సహకార సంస్థలో భారత్, పాకిస్తాన్‌లు పూర్తిస్థాయి సభ్య దేశాలుగా చేరడంతో అది మరింత బలోపే తం అయిందని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన ప్రసంగంలో అన్నారు. ఈ రెండు దేశాలకు గత ఏడాది ఈ సంస్థలో పూర్తి స్థాయి సభ్యత్వం లభించగా, సదస్సులో ఇరు దేశాలు పాల్గొనడం ఇదే మొదటి సారి. దీంతో జిన్‌పింగ్ ఈ రెండు దేశాలకు సాదరంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ, పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌లు ఎస్‌సిఓ 18వ వార్షిక సదస్సులో పాల్గొనడం చారిత్రక ఘట్టమన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నాటి మనస్తత్వాన్ని వదులుకోవాలని, ఉమ్మడి, సమగ్ర,సహకారాత్మక, సుస్థిర భద్రతకు దోహదపడే విధానాలను అనుసరించాలని ఆయన అన్నారు. ఇతర దేశాల భద్రతను పణంగా పెట్టి ఒక దేశానికే సంపూర్ణ భద్రత ఉండాలనే విధానాలను మానుకోవాలన్నారు. స్వీయ కేంద్రీకృత, హ్రస్వ దృష్టికల,రహస్య విధానాలను అంద రూ తిరస్కరించాలన్నారు. ప్రపంచ వాణిజ్యసంస్థ( డబ్లుటిఓ) నిబంధనలను పరిరక్షించాలన్నారు. విస్తృత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే వాణిజ్య విధానాలను సమర్థించాలని ఆయన కోరారు. ఉమ్మడి ప్రాజెక్టులకోసం ఎస్‌సిఓకు 30 బిలియన్ల యువాన్‌లు(4.7 బిలియన్ డాలర్లు) ఇవ్వనున్నట్లు కేడా ఆయన ప్రకటించారు.

పాక్ అధ్యక్షుడితో మోడీ కరచాలనం

moci

భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంబంధాలు దాదాపుగా స్తంభించిపోయిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్‌సిఓ) స్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ,పాక్ అఅధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్‌లు ఆదివారం కరచాలనం చేసి కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ఎస్‌సిఓ దేశాల నేతల మీడియా సమావేశం తర్వాత ఈ సంఘటన చోటు చేసుకొంది. ఎస్‌సిఓలో భారత్, పాక్‌లు గత ఏడాది  పూర్తి స్థాయి సభ్య దేశాలుగా చేరడం తెలిసిందే. ఇదిలా ఉండగా, ఈ సదస్సులో పాల్గొన్న మోడీ ఎస్‌సిఓ సభ్య దేశాల నేతలతో దాదాపు డజను దూవపాక్షిక చర్చలు జరిపారు. అచితే మోడీ, హుస్సేన్‌ల మధ్య మాత్రం ఎలాంటి ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. కేవలం మర్యా దపూర్వక కరచాలనానికే ఇరువురు నేతలు పరిమితమైనారు.

Comments

comments