Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పొగరుబోతు కూతురిగా..

anu-emmanuel

నాగచైతన్య హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘శైలజా రెడ్డి అల్లుడు’ షూటింగ్ సాఫీగా జరిగిపోతోంది. అను ఇమ్మాన్యూయెల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో చైతూ అత్తయ్యగా రమ్యకృష్ణ నటించనుంది. ఆమె త్వరలోనే సెట్‌లోకి అడుగు పెట్టనున్నారు. ఇకపోతే ఇందులో పాత్రల గురించి,  వాటి తీరుతెన్నుల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ అను ఇమ్మాన్యుయల్ మాత్రం తన పాత్ర గురించి చిన్న క్లూ ఇచ్చింది. దేన్నీ లెక్క చేయకుండా చైతూకి సవాల్ విసిరే పాత్రలో ఈ బ్యూటీ కనిపిస్తుందట. రమ్యకృష్ణ కూతురిగా అను నటిస్తుందన్న మాట. అత్త, అల్లుడి డ్రామాలో సహజంగానే మ ధ్య లో ఉండే కూతురి పాత్ర పొగరుబోతుతనంగానే ఉంటుంది. మారుతి కూడా అదే ఫార్ములాలో వెళ్తున్నట్టు తెలిసింది. ఈమధ్య ఇలాంటి లైన్‌తో సినిమా వచ్చి చాలా ఏళ్లు అయింది. ఇక అను ఇమ్మాన్యుయల్‌కు ఈ సినిమా హిట్ కావడం చాలా కీలకం. ఈ చిత్రంలో తమన్నాతో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేసిన ఫిల్మ్‌మేకర్స్ షూటింగ్‌ను నాలుగు నెలల్లో పూర్తిచేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు.

Comments

comments