Search
Tuesday 19 June 2018
  • :
  • :

రంజాన్ దుస్తులు పంపిణీ చేసిన హరీశ్‌రావు

Ramzan Dress Distributed by Harish Rao

సిద్ధిపేట : గజ్వేల్ , ప్రజ్ఞాపూర్‌లో సోమవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ముస్లింలకు రంజాన్ దుస్తులు, బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. అదేవిధంగా గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పలు మండలాలకు చెందిన 200 మందికి కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపి కొత్తపల్లి ప్రభాకర్‌రెడ్డి, ఎంఎల్‌సిలు పాతూరి సుధాకర్‌రెడ్డి, ఫారూఖ్ హుస్సేన్, గడ ప్రత్యేక అధికారి హన్మంతరావు, ఆర్‌డిఒ విజయేందర్‌రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Ramzan Dress Distributed by Harish Rao

Comments

comments