Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

పాన్‌లో మత్తు పదార్థం పెట్టి అత్యాచారం

RAPE

 

హైదరాబాద్: భాగ్యనగరంలో శుక్రవారం ఉదయం మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని కామాంధుడి ఉచ్చులో పడింది. ఉపేందర్ వర్మ అనే వ్యక్తి పెళ్లి పేరిట ఓ యువతిని మోసం చేశాడు. స్వీట్‌పాన్‌లో మత్తు పదార్థాలు కలిపి కామాంధుడు పలుమార్లు ఆమెపై అత్యాచారం చేశాడు. అశ్లీల వీడియోలు తీసి నెట్‌లో అప్‌లోడ్ చేస్తానంటూ ఉపేందర్ వర్మ ఆమెను బెదిరించాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం కాచిగూడ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఉపేంద్రవర్మను అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. ఫేస్‌బుక్‌లో అమ్మాయిలను అతడు ట్రాప్ చేసి లోబర్చుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం స్నేహితుల సహకారంతో ఉపేంద్ర వర్మ తప్పించుకున్నాడు. మయూర్ పాన్ హౌస్ ఓనర్ ఉపేంద్రవర్మకు హిమాయత్ నగర్‌తో సహా నగరంలో పలు చోట్ల పాన్ హౌస్‌లున్నాయి.

Comments

comments