Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

పెంపు బాటలో మరిన్ని బ్యాంకులు

bsns

 ఆర్‌బిఐ రెపో రేటు పెంపు ప్రభావం
 ప్రియం కానున్న వాహన, గృహ రుణాల ఇఎంఐలు
 రేట్ల పెంపుపై సమాచారం ఇచ్చిన ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్

న్యూఢిల్లీ : కీలక వడ్డీ రేట్లను ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) పెంచిన మరుసటి రోజు బ్యాంకులు కూడా రేట్ల పెంపు దిశగా అడుగులు ప్రారంభించాయి. దీంతో వాహ న, గృహ, వ్యాపార రుణాల వాయిదాలు మరింత భారం కానున్నాయి. అయితే ఆర్‌బిఐ సమీక్షకు ముందే కొన్ని పెద్ద బ్యాంకులు.. ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఎంసిఎల్‌ఆర్(మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్స్)ను పెంచాయి.  పెద్ద బ్యాంకుల మాదిరిగానే ఇండియన్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్ కూడా వివిధ కాల పరిమితులకు ఎంసిఎల్‌ఆర్‌ను 10 బేసిస్ పా యింట్లు పెంచుతున్నాయి. ఈమేరకు స్టాక్ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చాయి. ప్రభుత్వరంగ ఇండియన్ బ్యాంక్ 3 నెలల నుంచి 5 ఏళ్ల కాల పరిమితి రుణాలపై 10 బేసిస్ పాయింట్ల ఎంసిఎల్‌ఆర్‌ను పెంచింది. కరూర్‌వైశ్యా బ్యాంక్ కూడా 6 నెలల నుంచి ఏడాది కాలపరిమితి రు ణాలపై ఇదే విధంగా రేట్ల పెంపు చేపట్టింది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బిఒఎం) కూడా వడ్డీ రేట్లను పెంచనున్నట్టు సంకేతాలు ఇచ్చింది. బిఒఎం ఎండి, సిఇఒ ఆర్‌పి మరాథె మాట్లాడుతూ, రెపో రేటు పెంపు బదలి వివిధ టర్మ్‌లకు ఉంటుందని, ఇప్పటికే పలు బ్యాంకులు రేట్ల పెంపును ప్రకటించాయని అన్నారు. ‘రిటైల్ ద్రవ్యోల్బణం పెరగ డం, ప్రత్యేకించి ఇటీవల నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ఆందోళనల కారణాంగానే ఆర్‌బిఐ వడ్డీ రేట్లను పెంచింది’ అని బ్యాంక్ ఆఫ్ ఇండియా సిఇఒ దీనబంధు మోహపాత్ర అన్నారు. సిపిఐ ద్రవ్యల్బణంలో పునర్‌సమీక్ష చూస్తే.. వచ్చే నెలల్లో రిటైల్ ధరల స్థాయిపై ఆర్‌బిఐ మరింత నిఘా పెట్టనుందని తెలుస్తోందని అన్నారు. మూ డు రోజులపాటు ఆర్‌బిఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన సమావేశమైన ఎంపిసి(మానిటరీ పాలసీ కమిటీ) రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత రెపో రేటు 6.25 శాతానికి చేరింది. దీంతో దాదా పు నాలుగున్నరేళ్ల తర్వాత సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచినట్లయింది. అదేవిధంగా రివర్స్ రెపో రేటును పావు శాతం పెంచడంతో 6 శాతానికి చేరుకుంది. ముడిచము రు ధరల పెరుగుదల, సిపిఐ(వినిమయ ధరల సూచీ) పె రగడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో రెపో, రివ ర్స్ రెపో రేట్లను ఆర్‌బిఐ పెంచింది. రిటైల్ ద్రవ్యోల్బణం ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్‌లో 4.8- నుంచి 4.9 శాతం మధ్య ఉండొచ్చని, అదేవిధంగా ద్వితీయార్థంలో (అక్టోబర్- మార్చి) 4.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉం దని ఆర్‌బిఐ అంచనా వేసింది. గడిచిన ఆరు నెలలుగా రి టైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్ధేశించిన 4 శాతం పైనే కొనసాగుతోంది. ఏప్రిల్‌లో 4.58 శాతంగా నమోదైంది. బ్యాంక్ రేటు 6.5 శాతం, నగదు నిల్వల నిష్పత్తి (సిఆర్‌ఆర్) 4 శాతంగా కొనసాగుతాయి. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 6.5 శాతంగా ఉంటుంది. మొండిబకాయిల పరిష్కారానికి దివాలా చట్టం ఎంతగానో దోహదం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పిత్తి(జిడిపి) వృద్ధి రేటు గతంలో అంచనా వేసిన విధంగానే 7.4 శాతంగా ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణా న్ని మధ్యకాలికంగా 4 శాతానికి కట్టడి చేయాలన్నదే ల క్ష్యమని ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. ద్ర వ్యోల్బణం పెరుగుదలపై ఆర్‌బిఐ అప్రమత్తత కొనసాగుతుందని అన్నారు.

Comments

comments