Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

రబీలో తగ్గిన ధాన్యం సేకరణ

Reduced grain procurement in rabbi

గత యేడాది రబీలో 25 లక్షల క్వింటాళ్ల సేకరణ                                                                                                            ప్రస్తుత రబీలో సేకరించింది 15లక్షలు మాత్రమే
ప్రభావం చూపిన తమిళనాడు ఎగుమతి                                                                                                                      అకాల వర్షాలు దోమ పోటుతో తగ్గిన దిగుబడి

మనతెలంగాణ/పెద్దపల్లి: అకాల వర్షాలు, దోమపోటు ఆశించడంతో దిగుబడి తగ్గడం,ప్రై వేటు మార్కెట్లో కనీస మద్ధతు ధర స్థాయిలో కొనుగోళ్లు జరపడం,నేరుగా తమిళనాడుకు స రఫరా చేసుకునేందుకు ప్రభుత్వం రైస్ మి ల్లు లకు అనుమతి ఇవ్వడంతో ప్రస్తుత రబీ సీజన్ లో ధాన్యంసేకరణ తగ్గింది. గత యేడాది 2016-17రబీసీజన్‌లో పెద్దపల్లి జిల్లాలో 24, 77,720 లక్షల క్వింటాళ్ల ఎ గ్రేడ్ ధాన్యం, 50,830క్వింటాళ్ల సాధారణ రకం కలిపి మొ త్తం 25లక్షల 28వేల 560 క్వింటాళ్ల ధా న్యాన్ని 166 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్ర భుత్వం సేకరించింది.ప్రస్తుత రబీ సీజన్‌లో డిఆర్‌డిఎ,ప్రాథమిక వ్యవసాయ సహకార సం ఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన172 కొనుగోలు కేంద్రాల ద్వారా 15లక్షల క్వింటాళ్ల ధా న్యాన్ని మాత్రమే సేకరించగలిగింది. గడిచిన రబీ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభు త్వం పెద్ద మొత్తంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం,అందుకు తగ్గట్టుగా గన్నీ సంచులను సమకూర్చుకొని ముందస్తు చర్య లు చేపట్టినప్పటికి ఆశించిన మేర ధాన్యం మార్కెట్‌కు రాలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం రాక తె రుచుకోక పోవడం గమనార్హం.

ప్రభావం చూపిన తమిళనాడు ఎగుమతి
–తెలంగాణ ప్రభుత్వం సివిల్ సప్ల్లై శాఖతో సం బంధం లేకుండా తమిళనాడుకు బియ్యం సరఫరా చేసేందుకు నేరుగా రైతుల నుండి కొనుగోలు చేసుకునేందుకు రైస్ మిల్లులకు అనుమతినివ్వడంతో ఈ సారి ప్రభుత్వ కొనుగోలు కే ంద్రాలువెలవెల బోయాయి.ప్రభుత్వం నిర్ణయి ంచిన కనీస మద్ధ్దతు ధర కన్నా 30 రూపాయలు అధికంగా చెల్లించి రైతుల నుండి కొనుగోలు చేసుకునేందుకు పెద్దపల్లి జిల్లాలో 50 రైస్ మిల్లులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. రైతుల పంట పొలాల నుంచి మిల్లులు ధాన్యా న్ని 30రూపాయలు అధికంగా చెల్లించి కొనుగోలు చేయడంతో పలువురు రై తులు పోటీ పడి తమ ధాన్యాన్ని మిల్లర్లకు ఇవ్వడానికి సిద్ధ పడ్డారు.ఈ సీజన్‌లో 5 లక్షల 13 వందల క్వి ంటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కొనుగోలుపై ప్రభావం చూపి ందని అధికారులు చెబుతున్నారు.

అకాల వర్షాలతో తగ్గిన దిగుబడి
–రబీ సీజన్ మధ్యలో అకాల వర్షాలు కురవడానికి తోడు, దోమపోటు ఆశించడంతో పెద్దపల్లి జిల్లాలో వరి పంటకు పెద్దమొత్తంలో నష్టంవాటిల్లింది. పంట కోతకొచ్చిన చివరి దశలో జిలాల్లోని ప్రాంతాలైన కాల్వశ్రీ రాంపూర్, ఒదెల, ముత్తారం తదితర మండలాలకు నీరందక ప ంటలు ఎండి పోయాయి.
జిల్లా వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం ఈ రబీ సీజన్‌లో వివిధ కారణాల వల్ల దాదా పు 5వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. గడిచిన రబీ సీజన్‌లో హెక్టారుకు సగటున 70 బస్తాలు దాటిన దిగుబడి ఈ సారి 65 బస్తాల కు పడిపోడం జరిగింది. అతి వృషిక్టి,అనావృష్టి తోడు కావడంతో పెద్దపల్లి జిల్లాలో దిగుబడి అ నుకున్నంత రాక పోవడం కూడా ధాన్యం సేకరణపై ప్రభావం చూపిందని అధికారులు చెబుతున్నారు.

Comments

comments