Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

‘సస్పెన్షన్ల’ పై సమరం

Revenue records purgation mistakes

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : రెవెన్యూ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. సస్పెన్షన్లు, క్రమశిక్షణ చర్యల పట్ల పునరాలోచించకుంటే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లుతున్న తప్పులకు బాధ్యులను చేయడాన్ని తప్పుపడుతున్నారు. సమయం లేకపోవడం, సరైన అవగాహన కల్పించపోవడం, వెసు లు బాటు కల్పించకుండా ఒత్తిడి చేయడం తదితరల అనేక కారణాలతో  రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో దొర్లిన తప్పులు వెలికి వస్తున్న క్రమంలో రెవెన్యూ ఉద్యోగులను అన్నింటికీ బాధ్యులను చేస్తూ క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లు చేయడం పట్ల గుర్రు మంటున్నారు. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతధికారులు పునరాలోచించకకుంటే సమరం చేయడానికి సిద్దం అంటూ నినదిస్తున్నారు. ఇప్పటి వరకూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రమశిక్షణ చర్యలు, సస్పెన్షన్లకు 10 మంది రెవెన్యూ ఉద్యోగులు గురైన విషయం విధితమే. వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తిలో విఆర్వో సస్పెన్షన్, మహబూబాబాద్ జిల్లాలో ముగ్గురు ఉద్యోగులు, అర్బన్ జిల్లా పరిధిలోని కమలాపూర్, ఎల్కతుర్తి మండలాల పరిధిలోని కొందరు విఆర్వోలు, ఆర్‌ఐలపై క్రమశిక్షణ చర్యలకు సిద్దంగా ఫైల్ ఉన్నతాధికారులకు చేరడం వెరసి ఉద్యోగులలో కలకలం రేపింది.

ఆందోళనలకు దారి తీసే పరిస్థితులకు ఈ పరిణామాలు దారి తీశాయని ఉద్యోగ సంఘాలు తెలుపుతున్నాయి. జరుగుతున్న తప్పులకు సిబ్బందినే కారణంగాతప్పులకు సిబ్బందినే కారణంగా చూపుతూ ఉన్నతాధికారులు తీసుకుంటున్న చర్యలను నిరసిస్తూ అవసరమైనతే ఆందోలనకు సిద్దం కావాలని ఉద్యోగులు భావిస్తున్నట్లు పలువురు భావిస్తున్నారు. నేడు (10వ తేది) అర్బన్ జిల్లా కేంద్రంగా రెవెన్యూ ఉద్యోగుల జెఎసి సమావేశం కానుంది. నిజానికి వెబ్‌సైట్‌లోని సాంకేతిక సమస్యలు, సమయం లేకపోవడం, మరి కొన్ని చోట్ల విఆర్వోలకు కార్యక్రమం పట్ల ముందస్తు అవగాహణ లేకపోవడం లాంటి అనేక కారణాలు తప్పులు దొర్లదానికి దారితీచడాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోవడం అన్నింటికీ ఉద్యోగులనే బాధ్యులను చేస్తూ చర్యలు చేపట్టడం సరైంది కాదని రెవెన్యూ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోని  వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని, రెవెన్యూ ఉద్యోగుల పట్ల చర్యలు తీసుకునేటప్పుడు వాస్తవ పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరముందన్నారు. ఇట్టి విషయం లో పునరాలోచించకుంటే ఆందోళనలు తప్పవని స్పష్ట చేస్తున్నారు. నేడు (10వ తేది)న జరిగే జెఎసి సమావేశంలో కార్యచరణ రూపొందిస్తున్నట్లు తెలుపుతున్నారు.  తమపై తీసుకుంటున్న చర్యల పట్ల స్పందిచకుంటే రానున్న రోజులలో రైతు భీమా, ఇతర పథకాల అమలు పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు అంకిత భావంతో పని చేస్తున్నామని, ప్రభుత్వ పథకాల అమలుకు వ్యతిరేకం కాదని, తమ ఆవేదనను ప్రభుత్వం, ఉన్నతాధికారులు సాను కూల ంగా స్పంధించాలని కోరుతున్నారు.

Comments

comments