Search
Monday 25 June 2018
  • :
  • :
Latest News

రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు

Revisions of farmers' land records

మనతెలంగాణ/దండేపల్లి: భూరికార్డుల సవరణలో రైతులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సూచించారు. దండేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విఆర్‌ఓ, విఆర్‌ఏలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ రైతుల భూ రికార్డులను తప్పులను సవరించాలని, రెండు రోజు ల్లో సరిచేసి, ధరణి వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ చేయాలన్నారు. రెవెన్యూ సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్షం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. గ్రామాలలో విఆర్‌ఓలు అందుబాటులో ఉండి రైతులకు భూ సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ రామచంద్రయ్య ఆర్‌ఐ గణపతి, డిప్యూటీ తహసీల్దార్ వాసంతి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments