Search
Sunday 24 June 2018
  • :
  • :
Latest News

నడిస్తే నరకమే!

Road Completly Damaged In Budera Chowrastha

మన తెలంగాణ/మునిపల్లి : తెలంగాణ ప్రభుత్వం ప్రతి పల్లెకు రోడ్డు ఉండాలి, వాటిని కూడా నాణ్యతతో వేయాలని ఆదేశాలున్నప్పటికీ ఆదేశాలను సంబంధిత  కాంట్రాక్టర్, అధికారులు బేఖాతర్ చేస్తున్నారు. మండల పరిధిలోని బుదేరా చౌరస్తా నుంచి మండల కేంద్రమైన మునిపల్లి చౌరస్తా వరకు రూ.7 కోట్లు వెచ్చించి  డబుల్ రోడ్డు మంజూరైంది. దీంతో సదరు కాంట్రాక్టర్ రోడ్డు పనులను ప్రారంభించి నెలలు గడుస్తున్నా రోడ్డు పూర్తి కావడం లేదు. వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. ‘నడిస్తే నకరమే.. ప్రయాణిస్తే ప్రమాదమే’ అన్న చందంగా తయారైంది. మునిపల్లి చౌరస్తా  నుంచి పోల్కంపల్లి గ్రామం వరకు రోడ్డు పూర్తి అయ్యిం ది. అయితే అక్కడ నుంచి బుదేరా చౌరస్తా వరకు వెళ్లాలంటే నకరం  చూస్తున్నారు వాహనదారులు. చిన్న పాటి వర్షం పడితే చిత్తడే అన్నట్లు తయారైంది ఈ రోడ్డు. ఎండ కొడితేనేమో దుమ్ము, వాన పడితేనేమో బురద. తాము  ఎట్ల పోవాలో  అర్థం కావడం లేదని వాహనదారులు వాపోతున్నారు. బుదేరా వెళ్లాలంటే మాత్రం ఈ రోడ్డు గుండానే వెళ్లాల్సి ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో వెళ్లకతప్పడం లేదు. వెళ్లితే మాత్రం దుమ్ము.. దూళి, వర్షం పడితే బురదమయంగా మారడం మరో  సమస్యగా మారింది. ఇటు దుమ్ముకు తట్టుకోలేక.. అటు బురదకు తట్టుకోలేక వాహనదారులు ఇబ్బందుల మధ్య వాహనం నడపి గమ్యాన్ని చేరుకోవాల్సిన పరిస్థితి  ఏర్పడింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో  ద్విచక్రవాహనంపై ప్రయాణించిన వారు, కుటుంబంతో కలిసి వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు తప్ప లేదు. దీని కారణంగా కొంతమందైతే శనివా రం తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడిందని సమాచా రం. కార్లు సైతం బుదరకు  జారి ఆదుపు తప్పి పక్కకు వెళ్లిన పరిస్థితిదాపురించిం ది. వాహనదారులు ఇంత ఇబ్బందులు పడుతున్నా సదురు కాంట్రాక్టర్, అధికారులు కాని పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా కాం ట్రాక్టర్, సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేసి వా హనదారులకు ఇబ్బందుల్లేకుండా చేయాలని పలువురు కోరుతున్నారు.

Comments

comments